ETV Bharat / entertainment

దూసుకుపోతున్న 'బింబిసార-సీతారామం' కలెక్షన్స్​.. ఎంతంటే? - బింబిసార కలెక్షన్స్​

Bimbisara-Sitaramam Collections: నందమూరి హీరో కల్యాణ్​రామ్​ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'బింబిసార'. ఈ సినిమా ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అప్పటి నుంచి బాక్సాఫీస్​పై దండయాత్ర చేస్తూనే ఉంది. ఇప్పటికే మొదటి మూడు రోజులు సాలిడ్ కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా నాలుగో రోజు కూడా మంచి వసూళ్లనే సాధించింది. బింబిసారతో పాటే విడుదలై దుల్కర్​ సల్మాన్ సీతారామం కూడా మంచి వసూళ్లనే సాధిస్తోంది.​ మొత్తంగా ఈ చిత్రాలు 4 రోజుల్లో బాక్సాపీస్ వద్ద ఎంత కలెక్ట్​ చేశాయంటే..

Bimbisara-Sitaramam Collections
బింబిసార-సీతారామం కలెక్షన్స్
author img

By

Published : Aug 9, 2022, 12:16 PM IST

Bimbisara-Sitaramam Collections: దాదాపు రెండేళ్లు విరామం తర్వాత కల్యాణ్​రామ్ నటించిన 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. అంతేకాదు ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. సోమవారం నాలుగో రోజు కూడా డీసెంట్ వసూళ్లనే సాధించింది.మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.6 కోట్ల షేర్ (రూ. 6 కోట్ల గ్రాస్) అందుకుంది. రెండో రోజులు పూర్తయ్యేసరికి రూ. 12.14 కోట్ల షేర్ (రూ. 19.9 కోట్ల గ్రాస్), మూడో రోజులు పూర్తయ్యేసరికి రూ. 18.1 కోట్ల షేర్ (రూ. 29.8 కోట్ల గ్రాస్) కలెక్ట్​ చేసింది. ఇక నాలుగో రోజు పూర్తయ్యేసరికి రూ. 20.57 కోట్ల షేర్(రూ.34.2 కోట్ల గ్రాస్​) వసూలు చేసింది.

నాలుగో రోజు తెలంగాణలో (నైజాం) రూ. 6.47 కోట్లు షేర్, రాయలసీమలో(సీడెడ్) రూ. 3.93 కోట్లు షేర్, ఉత్తరాంధ్ర-రూ. 2.58 కోట్లు, ఈస్ట్ గోదావరి-రూ. 1.15 కోట్లు, వెస్ట్ గోదావరి-రూ. 0.83 కోట్లు, గుంటూరు - రూ. 1.42 కోట్లు, కృష్ణా-రూ.0.99, నెల్లూరు రూ. 56 లక్షలు.. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 17.93 కోట్ల షేర్ (రూ. 27.9 కోట్ల గ్రాస్ వసూళ్లు) అందుకుంది.

ఇక బింబిసారతో విడుదలైన దుల్కర్​ సల్మాన్ 'సీతారామం'.. మూడు రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.10కోట్ల షేర్​, 21.7కోట్ల గ్రాస్​ అందుకుంది. ఏపీ తెలంగాణలో రూ.5.4కోట్ల షేర్​, 10.2కోట్ల గ్రాస్​ను వసూలు చేసింది. అయితే నాలుగో రోజు కలెక్షన్స్​పై ఇంకా స్పష్టత రాలేదు.

ఇదీ చూడండి: ఫొటోలో ఉన్న టాలీవుడ్​ హీరోను గుర్తుపట్టగలరా?.. ఈ వారమే భారీ సినిమాతో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.