ETV Bharat / entertainment

రీరిలీజ్​లో 'సింహాద్రి' ఆల్​టైమ్ రికార్డ్​​.. ఫస్ట్​ డే సూపర్​ కలెక్షన్స్​!

జూనియర్ ఎన్టీఆర్​ గతంలో నటించిన 'సింహాద్రి' రీరిలీజ్​ గ్రాండ్​గా జరిగింది. అయితే ఈ చిత్రానికి ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్​ వచ్చినట్లు తెలిసింది. ఆ వివరాలు..

Simhadri rerelease record collections
'సింహాద్రి' రీరిలీజ్​.. ఫస్ట్​ డే రికార్డు కలెక్షన్స్​
author img

By

Published : May 21, 2023, 3:17 PM IST

Updated : May 21, 2023, 4:05 PM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్​ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చి సూపర్ హిట్​గా నిలిచిన చిత్రాలనో, లేదంటే అప్పుడు ప్రేక్షకులు అంతగా ఆదరించని క్లాసిక్ చిత్రాలనో ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు. ఇప్పటికే పలు హీరోల సినిమాలు రిలీజ్ కాగా.. వాటికి విశేషమైన స్పందన లభించింది. మంచి కలెక్షన్లు కూడా దక్కాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్(మే 20) పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన 'సింహాద్రి' సినిమాను కూడా రీ రిలీజ్​ అయింది. ఏకంగా 1000కు పైగా స్క్రీన్లలో విడుదలైంది. అయితే ఈ చిత్రానికి తొలి రోజు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రికార్డు కలెక్షన్లను అందుకుందని ట్రేడ్​ వర్గాలు అంటున్నాయి. వరల్డ్​ వైడ్​గా రూ.5.2కోట్ల గ్రాస్ కలెక్షన్స్​ను సాధించినట్లు తెలిసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.90కోట్ల వరకు గ్రాస్ వచ్చిందట. నైజాంలో రూ.1.10కోట్లు, సీడెడ్​ రూ.0.78కోట్లు, ఆంధ్ర రూ.1.56కోట్లు, కర్ణాటక రూ.0.32కోట్లు, తమిళనాడు రూ.0.13కోట్లు, రెస్ట్​ ఆఫ్ ఇండియా రూ.0.34కోట్లు, యూఎస్​ఏ రూ.0.46 కోట్లు వరకు గ్రాస్ వచ్చాయట. ​

ఫ్యాన్స్ లెక్కలు మరోలా.. 'సింహాద్రి' సినిమా ఫస్ట్​ డే చూసేందుకు నందమూరి అభిమానులు థియేటర్లకు బారులు తీరారు. థియేటర్లంతా అభిమానుల సందడి వాతావరణంతో కిక్కిరిసిపోయాయి. అయితే ఈ చిత్ర రీరిలీజ్​ కలెక్షన్స్ విషయంలో అభిమానులు చెప్పే లెక్కలు మరోలా ఉన్నాయి​. వరల్డ్​ వైడ్​గా రూ. 6.2 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసినట్లు వారు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ.. రూ.4 నుంచి రూ.6 కోట్ల మధ్యలో గ్రాస్​ వసూలు వచ్చినట్లు తెలుస్తోంది.

తొలి స్థానంలో 'సింహాద్రి'.. రీరిలీజ్​లో ఫస్ట్​ డే రూ.కోటి రూపాయలకుపైగా గ్రాస్ వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇప్పటి వరకు తొమ్మిది ఉన్నాయి. వాటిలో 'సింహాద్రి' రూ.5.2కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత.. పవన్​ కల్యాణ్​ 'ఖుషి' రూ.4.15 కోట్లు, 'జల్సా' రూ.3.20 కోట్లు, మహేశ్ బాబు 'ఒక్కడు' రూ.2 కోట్లు, 'పోకిరి' రూ.1.73 కోట్లు, అల్లు అర్జున్​ 'దేశముదురు' రూ.1.58 కోట్లు, రామ్​చరణ్​ 'ఆరెంజ్' రూ.1.53 కోట్లు, బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి' రూ.1.10 కోట్లు, ప్రభాస్​ 'బిల్లా' రూ.1.05 కోట్లు వరుస స్థానాల్లో నిలిచాయి.

సరికొత్త రికార్డు.. 'సింహాద్రి' రీరిలీజ్ చేయడం వల్ల.. మరోసారి సోషల్‌ మీడియాలో ఈ సినిమా పాటలు, డైలాగులు ఫుల్​ ట్రెండ్‌ అవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణాతో పాటు ఓవర్సీస్‌లోనూ సుమారు 150కి పైగా థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. మొత్తం 1210 షోలు ప్రదర్శించి సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌ మెల్‌బోర్న ఐమాక్స్‌ థియేటర్‌లోనూ ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేయడం మరో విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: కాస్ట్లీ విల్లాను కొనుగోలు చేసిన పాప్​ సింగర్స్.. ధర​ రూ.1650 కోట్లు!

Last Updated : May 21, 2023, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.