ETV Bharat / entertainment

Jawan Day 1 Collection : కలెక్షన్లలో 'జవాన్​' దూకుడు.. ఏడాదిలో రెండు సినిమాలతో కింగ్ ఖాన్​ రికార్డు.. - Jawan Movie box office collection

Jawan Day 1 Collection : బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'జవాన్​'. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే ?

Jawan Day 1 Collection
Jawan Day 1 Collection
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 10:28 AM IST

Updated : Sep 8, 2023, 11:37 AM IST

Jawan Day 1 Collection : బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'జవాన్​'. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్​ క్రియేట్ చేస్తోంది. భారీ అంచనాలతో రిలీజైన ఈ మూవీ.. ఆ అంచనాలు దాటి దూసుకెళ్తోంది. దీంతో కింగ్​ ఖాన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక తొలి రోజు ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూలు సాధించి బాక్సాఫీస్​ను షేక్​ చేసింది. ట్రేడ్​ వర్గాల సమాచారం ప్రకారం 'జవాన్' తొలి రోజు ఇండియాలో రూ.75 కోట్ల సంపాదించింది. హిందీ వెర్షన్​లో ఈ చిత్రం దాదాపు రూ. 65 కోట్ల రూపాయలను వసూలు చేయగా.. మిగిలిన మొత్తం డబ్బింగ్ వెర్షన్ల నుంచి వచ్చిందే.ఈ వసూలు రికార్డుతో ఆయన 'పఠాన్​' రికార్డులనే అధిగమించారు.

Sharukh Khan Jawan Movie Collection : 'పఠాన్​' తొలి రోజు రూ.57 కోట్లు సంపాదించగా.. 'జవాన్'​ మాత్రం రూ. 75 కోట్లు వసూలు చేసి టాప్​కు చేరుకుంది. ఈ క్రమంలో షారుక్​ మరో రికార్డును అందుకున్నారు. ఒకే ఏడాదిలో రిలీజైన రెండు సినిమాలకు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైక ఇండియన్​ స్టార్​గా చరిత్రకెక్కాడు. ఆయన నటించిన రెండు సినిమాలు ఇలా ఒకదానికి మించి ఒకటి రికార్డు స్థాయిలో వసూలు సాధించడం పట్ల షారుక్ ఫ్యాన్స్​ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెట్టింట 'జవాన్' సినిమాను ట్రెండ్ చేస్తున్నారు.

Jawan Cast : ముందు నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చిన 'జవాన్'కు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో షారుక్​ లుక్​ కొత్తగా ఉందని, యాక్షన్ సీన్స్ అదిరిపోయాయంటూ సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో షారుక్​కు జోడీగా తమిళ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా.. సీనియర్ నటి ప్రియమణి , సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్‌ గ్రోవర్‌ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మరోవైపు దీపికా పదుకొణె, స్టార్​ హీరో సంజయ్‌ దత్‌ గెస్ట్​ రోల్స్​లో కనిపించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.

Miss Shetty Mr Polishetty VS Jawan : రెండు సినిమాలు ఒకే ఓటీటీలో.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Jawan Movie Telugu Review : 'జవాన్​'లో అన్ని షేడ్స్​.. షారుక్​ ప్రేక్షకులను మెప్పించారా ?

Last Updated : Sep 8, 2023, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.