ETV Bharat / entertainment

Jawan Box Office Collection Worldwide : జవాన్ కలెక్షన్ల సునామీ.. రూ. 1000 కోట్ల క్లబ్​లోకి ఎంట్రీ - pathan cast and c

Jawan Box Office Collection Worldwide : బాలీవుడ్ స్టార్ హీరో షారుక్​ ఖాన్ 'జవాన్'​ సినిమాతో రికార్డులు తిరగరాస్తున్నారు. తాజాగా ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్​లో చేరింది.

jawan box office collection worldwide
jawan box office collection worldwide
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 7:54 PM IST

Updated : Sep 25, 2023, 8:29 PM IST

Jawan Box Office Collection Worldwide : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్ 'జవాన్'.. సెప్టెంబర్ 7న రిలీజై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జవాన్ అనేక రికార్డులు సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. తాజాగా జవాన్ రూ. వెయ్యి కోట్ల క్లబ్​లో చేరింది. ఈ సినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు వసూల్ చేసింది. దీంతో షారుక్ తన కెరీర్​లో వరుసగా రెండోసారి వెయ్యి కోట్ల మార్క్​ను అందుకున్నారు.

దేశవ్యాప్తంగా రూ. 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు..

  • దంగల్
  • బాహుబలి ది కంక్లూజన్
  • కేజీఎఫ్
  • ఆర్​ఆర్​ఆర్​
  • పఠాన్
  • జవాన్

సినిమా విషయానికొస్తే.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించారు. షారుక్​కు జోడీగా సౌత్​ లేడి సూపర్ స్టార్ నయనతార నటించారు. ఈ సినిమాలో ఆమె ఇన్​వెస్టిగేషన్​ ఆఫీసర్​గా కనిపించారు. ఇక స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా.. సీనియర్ నటి ప్రియమణి, యోగి బాబు, రిద్ధి దోగ్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె గెస్ట్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.

ఈ ఏడాదిలో రెండోసారి.. షారుక్ తన కెరీర్​లో రూ. 1000 కోట్ల మార్క్​ను వరుసగా రెండోసారి అందుకున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'పఠాన్'​ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద.. కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1050.30 కోట్ల వసూళ్లు రాబట్టింది. దీంతో భారత సినీ ఇండస్ట్రీలో రెండుసార్లు ఈ రికార్డు సాధించిన తొలి హీరోగా షారుక్ నిలిచారు. ఇక 'పఠాన్'​లో షారుక్​ సరసన బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె హీరోయిన్​గా నటించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఈ సినిమాలో గెస్ట్​ రోల్​లో కనిపించారు.

షారుక్​ 'పఠాన్' రెమ్యునరేషన్​.. కేజీయఫ్​,​ బాహుబలి బడ్జెట్ కన్నా ఎక్కువగా!

Jawan Oscar : షారుక్ 'జవాన్'​కు ఆస్కార్​ రేంజ్ సత్తా ఉందా?

Last Updated : Sep 25, 2023, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.