ETV Bharat / entertainment

షారుఖ్​ 'జవాన్​'లో మరో స్టార్​ హీరో? ఫ్యాన్స్​కు పండగే! - అట్లీతో హీరో విజయ్​

Sharukh Khan Jawan : తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న షారుఖ్​ కొత్త చిత్రం 'జవాన్​'. ఫస్ట్​లుక్​తోనే క్రేజ్​ తెచ్చుకున్న ఈ చిత్రం..​ తెరపైకి ఎక్కకుండానే ఎన్నో రూమర్స్​కు నెలవవుతోంది. తాజాగా ఈ మూవీలోకి ఓ స్టార్​ హీరో రానున్నట్లు సమాచారం. ఆ హీరో ఎవరంటే?

Is Thalapathy Vijay part of Shah Rukh Khan's 'Jawan'? Atlee's latest post leaves fans curious

author img

By

Published : Sep 23, 2022, 2:22 PM IST

Sharukh Khan Jawan : బాలీవుడ్​ బాద్​షా షారుఖ్​ఖాన్​ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'జవాన్'. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న ఓ ఫొటో వల్ల ఆ సినిమాలో మరో ప్రముఖ్య వ్యక్తి కనపడనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. చిత్ర దర్శకుడు అట్లీ తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేసిన ఫొటోతో ఈ విషయం మరింత బలపడుతోంది.

సెప్టెంబర్​ 21న తన పుట్టినరోజు సందర్భంగా మిత్రులు, కొంతమంది నటీనటుల సమక్షంలో పార్టీ చేసుకున్నారు దర్శకుడు అట్లీ. అయితే ఈ పార్టీకి సంబంధించిన ఓ ఫొటోను అట్లీ ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు స్టార్ల మధ్య అట్లీ ఉన్నారు. ఆ ఇద్దరు స్టార్లు మరెవరో కాదు. ఒకరు కింగ్​ ఖాన్​ షారుఖ్​, మరొకరు తమిళ స్టార్​ దళపతి విజయ్​.. ఈ ఫొటోను చూసిన అభిమానులు విజయ్ కచ్చితంగా 'జవాన్'​లో భాగమై ఉంటాడని అంటున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే నెట్టింట్లో హల్​చల్ చేస్తోంది. ఐదు భాషల్లో రిలీజ్​ కానున్న ఈ సినిమా 2023లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రెడ్​ చిల్లీస్​ ఎంటర్​టైనమంట్స్​తో పాటు గౌరీ ఖాన్​ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. షారుఖ్​ మరో రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో 'పఠాన్'. మరొకటి రాజ్ కుమార్ హిరానీ 'డుంకీ' మూవీ.

ఇదీ చదవండి: శాకుంతలం టీమ్​ నుంచి గుడ్​ న్యూస్​.. రిలీజ్ డేట్​ ఇదే..

ఈ సొట్టబుగ్గల సుందరి పోగొడుతోంది కుర్రకారు మతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.