ETV Bharat / entertainment

''జవాన్​'లో షారుక్ లుక్​ కాపీనే.. సీన్స్​ కూడా ఆ సినిమాలోవే!'.. లైక్స్​లో 'సలార్'​దే పైచేయి.. - జవాన్ సినిమా ట్రైలర్

Jawan Prevue Reaction : బాలీవుడ్​ సూపర్​ స్టార్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా ట్రైలర్​​పై భిన్న స్పందనలు వస్తున్నాయి. ఈ సినిమా మూన్​లైట్​, బాహుబలి, కేజీఎఫ్​ తదితర చిత్రాల నుంచి కాపీ కొట్టారని ట్రోల్స్​ మొదలయ్యాయి.

jawan vs salar
jawan vs salar
author img

By

Published : Jul 10, 2023, 6:41 PM IST

Jawan VS Salaar : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ అగ్ర కథానాయకుడు​ షారుక్ ఖాన్ నటించిన చిత్రం 'జవాన్'. సెప్టెంబర్​ 7న ఈ సినిమా​ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రివ్యూ పేరుతో 2:12 నిమిషాల నిడివి గల వీడియోను సోమవారం రిలీజ్​ చేసింది మూవీటీమ్​. ఈ ప్రచార చిత్రం యాక్షన్ సన్నివేశాలతో, కళ్లు చెదిరే విజువల్స్​తో ఉంది. అయితే, ఈ ప్రచార చిత్రంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

షారుక్​ బీస్ట్​ మోడ్​లో తన విశ్వరూపం చూపించారని కొంతమంది అభిప్రాయ పడ్డారు. మరికొందరు.. ఈ​ సినిమాను పలు సినిమాల నుంచి కాపీ కొట్టారని సోషల్​ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరికొంతమంది వివిధ సినిమాల క్లిప్స్​ను జతచేస్తూ.. వాటి నుంచి జవాన్​ కాపీ కొట్టారని ట్విట్టర్​లో ట్రోల్స్​ చేస్తున్నారు. షారుక్​ లుక్​ మూన్​లైట్ సినిమా నుంచి కాపీ కొట్టారని ఓ నెటిజన్​ కామెంట్ చేయగా.. కేజీఎఫ్​, సలార్, బాహుబలి తదితర దక్షిణాది చిత్రాల సమ్మేళనంగా ఉందని మరో యూజర్​ ట్వీట్ చేశాడు. ఇక మరో నెటిజన్​ స్పందిస్తూ.. శివాజీలో రజినీకాంత్ ఫోటో.. జవాన్​లో షారుక్​ ఫొటో జత చేసి.. కాపీ కొట్టారని రాశాడు.

  • I wanted to make a new film but Srk said that till date I hv worked only in copy films nd Srk said that most of his films are copied from Hollywood.
    In this film also I hv copied frm Hollywood, Bollywood, Kollywood. And in future I'll not work with this Hakla" ~#Atlee #Jawan pic.twitter.com/l1Op3br5lK

    — 𝚂𝚝𝚊𝚛𝙱𝚘𝚢 𝙼𝚊𝚍𝚍𝚢⚡🚬 𝙵𝚊𝚗 𝙰𝚌𝚌𝚘𝚞𝚗𝚝 (@StarBoy_Maddy) July 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • No dedication, only copy!
    even his old age face covered by VFX.
    Honestly, #Jawan teaser disappoints me. #JawanPreveu

    #ShahRukhKhan should stick to romantic genre movies, he can't fit in action movies. now days, he can't fit in romantic movies too because of his old face. pic.twitter.com/AvVDXbAZex

    — ♔ (@Darsh_Official_) July 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దీంతో పాటు టికెట్లు విక్రయించే వెబ్​సైట్​ బుక్​ మై షోలో లైక్స్​లో కూడా రెండు సినిమాలను పోల్చుతున్నారు. ఈ లైక్స్​ ప్రకారం.. 'జవాన్​' కంటే 'సలార్'​పై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 'సలార్'​ దూసుకెళ్తోంది. ఈ సినిమాకు ఇప్పటికే 1.87 లక్షల మంది ఆసక్తి కనబర్చారు. 'జవాన్​'కు మాత్రం 1.03 మంది లైక్స్​ కొట్టారు. అయితే ఈ రెండు సినిమాల ట్రైలర్లు విడుదలై యూట్యూబ్​లో ట్రెండింగ్ అవుతున్నాయి. సలార్​ ట్రైలర్​ నాలుగు రోజుల్లో 110 మిలియన్లకు పైగా వ్యూస్​ సాధించింది. ఇక, సోమవారం విడుదలైన జవాన్​ ట్రైలర్​ హిందీలో 11 మిలియన్ల వీక్షణలను దాటేసింది. ఈ సినిమాలు రెండు చెరో రూ. వెయ్యి కోట్ల సాధిస్తాయని అభిమానలు గట్టిగా నమ్ముతున్నారు.

Jawan Cast : జవాన్​ సినిమాను ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార, విజయ్‌ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణె అతిథి పాత్రలో కనిపించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.