టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్టర్ వేదికగా తన మనసులోని మాటను పంచుకున్నారు. ఈ మేరకు.. "మీ శక్తి సామర్థ్యాలు, సాధించాలనే పట్టుదల, అచంచలమైన సంకల్పం ఎప్పటికీ కొనసాగుతుంది. మీ విజయాలను ప్రపంచం జరుపుకుంటోంది. నా భార్యకు.. అలాగే మహిళలందరికీ ఉమెన్స్ డేశూభాకాంక్షలు" అని మహేశ్ ట్వీట్ చేశారు.
తన విజయానికి మెయిన్ పిల్లర్ తన భార్యే అని మహేశ్ బాబు చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే, ఒకప్పుడు ఇద్దరూ సినిమాల్లో దూసుకెళ్లిన తారలే. పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు గుడ్‌బాయ్ చెప్పారు. మహేశ్ బాబు తన కెరీర్‌పై ఫోకస్ పెట్టేలా.. ఇళ్లు, పిల్లలు, వ్యాపారం లాంటి బాధ్యతలన్నీ తన భుజాన వేసుకున్నారు నమ్రత. తన భార్య త్యాగాలు.. ఆమె చేసిన సపోర్టును గురించి మహేశ్ చాలా ఇంటర్య్వూల్లో చెప్పారు.
ఇక, గత నెల ఈ సెలెబ్రిటీ కపుల్ తమ 18వ వివాహ వార్షికోత్సావాన్ని జరుపుకున్నారు. ఆ రోజు కూడా మహేశ్ బాబు స్పెషల్ పోస్టు పెట్టారు. '18 ఏళ్లుగా కలిసి ఉన్నాం. ఈ బంధం ఎప్పటికీ ఇలానే కొనసాగాలి. హ్యాపీ యానివర్సరీ నమ్రత' అంటూ రాసుకొచ్చారు. మరవైపు, నమ్రత కూడా ఓ అపురూప చిత్రాన్ని పోస్ట్ చేస్తూ.. 'మనం తీసుకున్న ఈ బెస్ట్ నిర్ణయానికి 18 ఏళ్లు. హ్యాపీ యానివర్సరీ మహేశ్‌బాబు' అంటూ పోస్టు పెట్టారు.
కాగా, వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో వెండితెరపై ఈ తారలిద్దరూ సందడి చేశారు. ఆ సినిమా షూటింగ్‌లోనే స్నేహితులుగా మారారు. ఆ తర్వాత కొంతకాలానికే వీరి స్నేహబంధం.. ప్రేమగా మారింది. ఆపై వివాహానికి దారి తీసింది. పెళ్లికి ముందు ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో నటించిన నమ్రత.. చివరిగా అంజి చిత్రంలో చిరంజీవికి జంటగా కనిపించారు. వివాహం తర్వాత ఆమె నటనకు దూరమయ్యారు.
ఇక, మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సూపర్ స్టార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా ఘన విజయాలు సాధించాయి. దీంతో 12 తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్‌పై కుడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఎస్ఎస్ఎమ్బీ 28 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే ఆడిపాడనుంది. ఈ మూవీని హారిక, హాసిన్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేశ్.. దిగ్గజ దర్శకుడు రాజమౌళితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం ప్రపంచ సాహసికుడి కథాంశంతో తెరకెక్కుతోందని సమాచారం.
-
Celebrating your strength, resilience, and unwavering determination today and everyday. Happy Women's Day to mine and all the women! 🤗🤗🤗
— Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Celebrating your strength, resilience, and unwavering determination today and everyday. Happy Women's Day to mine and all the women! 🤗🤗🤗
— Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2023Celebrating your strength, resilience, and unwavering determination today and everyday. Happy Women's Day to mine and all the women! 🤗🤗🤗
— Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2023