ETV Bharat / entertainment

60ఏళ్ల వయసులోనూ నో రిలాక్స్​.. యంగ్ హీరోలకు పోటీగా బాక్సాఫీస్ బద్దల్​ - sharukkh khan pathan collections

Indian Box Office Collections 2023 : ఇప్పుడు టాలీవుడ్​తో పాటు ఇండియావైడ్​గా ఉన్న అన్ని సినీ ఇండస్ట్రీలలో ఓ ఆసక్తికరమైన ట్రెండ్ కొనసాగుతోంది. అదేంటంటే.. యంగ్ హీరోలకు పోటీగా 60 ప్లస్​ సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే యంగ్ హీరోస్​కు పెద్ద టార్గెట్స్ పెడుతున్నారు. మరి ఏఏ భాషల్లో ఏఏ సీనియర్ హీరోలు.. ఎలాంటి వసూళ్లను అందుకుంటున్నారో చూద్దాం..

60ఏళ్ల వయసులోనూ నో రిలాక్స్​.. యంగ్ హీరోలకు పోటీగా బాక్సాఫీస్ బద్దల్​

author img

By

Published : Aug 14, 2023, 10:58 PM IST

Updated : Aug 15, 2023, 10:16 AM IST

Indian Box Office Collections 2023 : ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్​తో పాటు టాలీవుడ్​లో సీనియర్ హీరోల హవా బాగా కొనసాగుతోంది. నిజానికి 60 ఏళ్లు వచ్చిందంటే హీరోలుగా రిటైర్ అయిపోతారు. ఇతర క్యారెక్టర్లు చేసుకుంటుంటారు. కానీ ఇప్పుడా పరిస్థితి అస్సలు కనపడట్లేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సీనియర్ హీరోలు సత్తా చూపిస్తున్నారు. తమ క్రేజ్, ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదని తమ సినిమాలతో నిరూపించుకుంటున్నారు.

కోలీవుడ్ విషయానికి వస్తే... యూనివర్స్ స్టార్​ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి సీనియర్ హీరోలు ఇంకా స్టార్​ డమ్​ను కొనసాగిస్తూ సినిమాలు చేస్తున్నారు. రీసెంట్​గా విక్రమ్​తో వచ్చిన కమల్​హాసన్​ ఇండియావైడ్​గా రూ.400కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నారు. తాజాగా రజనీకాంత్​ జైలర్(jailer world wide collections) కూడా విడుదలైన మూడు రోజుల్లో రూ.400కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది. ఈ టార్గెట్స్​ను అందుకోవడానికి అక్కడ ఇతర స్టార్ హీరోలైన విజయ్, అజిత్, ధనుశ్​ వంటి వారు ఇంకా ప్రయత్నాలు చేయాల్సి వస్తోంది.

తెలుగు హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటినిస్తున్నారు. తాజాగా చిరు భోళాశంకర్, ఆ మధ్యలో ఆచార్య డిజాస్టర్లుగా నిలిచాయి కానీ.. వాల్తేరు వీరయ్య ఏకంగా రూ.200కోట్లను అందుకుంది. గాడ్ ఫాదర్ సినిమా కూడా బానే ఆడింది. ఇక బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి రూ.100కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఒకరకంగా చూస్తే.. వీరందరూ కూడా తమ సినిమాలతో కుర్ర హీరోలకు గట్టి పోటినిస్తున్నారనే చెప్పాలి.

బాలీవుడ్​లోనూ ఇదే హావా నడుస్తోంది. 60ఏళ్లకు చేరువలో ఉన్న బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్ ఇంకా తన స్టార్ ఇమేజ్​ను అలానే కొనసాగిస్తున్నారు. ఆ మధ్య పఠాన్​తో రూ.1000కోట్ల వసూళ్లను అందుకున్న కింగ్​ ఖాన్​ బాక్సాఫీస్​ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించారు. ఎన్నో వరుస ఫ్లాప్​లను అందుకున్న 55ఏళ్ల అక్షయ్​ కుమార్ తాజాగా ఓమైడా గాడ్​ 2తో(akshay kumar oh my god 2 collections) మళ్లీ సక్సెస్​ ట్రాక్​లోకి అడుగుపెట్టారు. అలాగే ​సన్నీదెవోల్‌​ కూడా తాజాగా రిలీజైన గదర్ 2తో(sunny deol gaddar 2 movie collections) ఇప్పటివరకు దాదాపు రూ.200కోట్ల వరకు వసూలు చేశారు. ఇంకా ఓమై గాడ్ 2, గదర్ 2 సినిమాలు సక్సెస్​ఫుల్​గా రన్​ అవుతున్నాయి. అలా ఈ సీనియర్​ హీరోలు 60కు చేరువలో ఉండి, అలాగే 60 దాటిన కూడా రిటైర్మెంట్ తీసుకుకోకుండా రిలాక్స్​గా ఉండకుండా కుర్ర హీరోలకు గట్టి పోటినిస్తున్నారు.

Last Updated : Aug 15, 2023, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.