Highest Paid Actor In India : భారతీయ చలన చిత్ర రంగంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. స్టార్‌గా ఎదిగిన వారున్నారు. మరికొందరు తమ పూర్వీకులు, బంధువులు, కుటుంబ సభ్యుల సహకారంతో వచ్చి పేరు స్టార్డం తెచ్చుకున్నవారు కూడా ఉన్నారు. మంచి బ్యాక్ గ్రౌండ్‌తో వచ్చినా.. సరైన గుర్తింపు తెచ్చుకోలేక చతికిలపడ్డవాళ్లు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు.
అయితే ఎంత మంచి నేపథ్యం నుంచి వచ్చినా కూడా.. ఆ స్టార్ డమ్‌ను కొనసాగించడం అనేది కత్తి మీద సామే. అలా పేరున్న నేపథ్యం నుంచి వచ్చిన ఓ స్టార్.. రూ. 500 కంటే తక్కువ రెమ్యునరేషన్‌తో బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. క్రమంగా ఎదుగుతూ.. తన టాలెంట్‌తో హీరో అయ్యారు. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటుల్లో ఒకడిగా నిలిచారు. ఇప్పుడు సినిమాకు రూ.200 కోట్లు తీసుకుంటున్నారు.
ఇంతకీ ఎవరా కథానాయకుడు అంటే.. తమిళులతో పాటు సినీ ప్రేమికులు దళపతి అంటూ ముద్దుగా పిలుచుకునే విజయ్. 80వ దశకంలో బాల నటుడిగా కెరీర్‌ను ఆరంభించిన విజయ్.. రూ.500ను తన తొలి రెమ్యునరేషన్‌గా అందుకున్నారు. ఇక 1984లో తన తండ్రి ఎస్ఏ చంద్ర శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వెట్రి' అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. 2000 ప్రారంభంలో విజయ్.. హీరోగా సినిమాలు చేయడం ప్రారంభించారు. కానీ స్టార్ డమ్ మాత్రం ఆ ఏడాది చివర్లో వచ్చింది. 2010 మధ్యలోకి వచ్చే సరికి ప్రజల్లో మంచి క్రేజ్ సంపాదించుకుని.. రజనీ కాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోల సరసన చేరారు.
Vijay Movies List : వినూత్నమైన కథల ఎంపికతో బాక్సాఫీసు రికార్డులను షేక్ చేశారు. 'తుపాకీ', 'మెర్సల్', 'సర్కార్', 'బిగిల్', 'మాస్టర్' సినిమాలతో బ్లాక్ బ్లాస్టర్ హిట్లు కొట్టారు. తాజాగా ఆయన లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో రూపొందిన 'లియో' సినిమాలో నటించారు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సినీ వర్గాల సమాచారం ప్రకారం విజయ్.. ఈ సినిమాకు రూ.200 కోట్లు పారితోషికాన్ని అందుకున్నారట. అలా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటులలో ఒకరిగా రికార్డు క్రియేట్ చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Vijay Net Worth : మరోవైపు సినీ ట్రేడ్ వర్గాల ప్రకారం.. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న రికార్డు రజనీకాంత్ పేరు మీద ఉంది. తన రీసెంట్ మూవీ 'జైలర్'కు ఆయన రూ.250 కోట్లు తీసుకున్నారని టాక్. ఇందులో రెమ్యునరేషన్‌తో పాటు సినిమా హిట్టయినందుకు నిర్మాత బహుమతిగా ఇచ్చిన నగదు కూడా ఉందని సమాచారం. ఏదేమైనప్పటికీ దళపతి విజయ్ ఇండియాలో ధనిక యాక్టర్లలో ఒకరిగా ఉన్నారు. ప్రముఖ మ్యాగజైన్ GQ ప్రకారం.. విజయ్ 2022 నెట్ వర్త్ సుమారు 56 మిలియన్ డాలర్లుగా ఉందని అంచనా. మన రూపాయల్లో ఆ మెత్తం సుమారు రూ.450 కోట్లు.
Actress Who Acted In 450 Films : 14 ఏళ్లకే పెళ్లి.. 450 చిత్రాల్లో మెరిసిన ఆ నటి ఎవరో తెలుసా?
స్టార్ హీరో కాదు.. కానీ ఈ యాక్టర్ చివరి మూడు సినిమాల కలెక్షన్లు రూ.1900 కోట్లు!