ETV Bharat / entertainment

మహేశ్​ను దాటేసిన తేజ సజ్జ - సంక్రాంతి సినిమాల్లో 'హనుమాన్' టాప్‌!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 12:49 PM IST

Updated : Jan 6, 2024, 12:56 PM IST

Guntur Kaaram VS Hanuman : ఆ విషయంలో మహేశ్ 'గుంటూరు కారం' సినిమాను క్రాస్ చేసింది తేజ సజ్జా 'హనుమాన్' చిత్రం. ఇంతకీ అదేంటంటే?

Guntur Kaaram VS Hanuman
మహేశ్​ను దాటేసిన తేజా సజ్జా - సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ టాప్‌

Guntur Kaaram VS Hanuman : ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వ‌ద్ద నాలుగు స్ట్రెయిట్ సినిమాల‌తో పాటు మూడు డ‌బ్బింగ్ సినిమాలు పోటీ ప‌డ‌నున్న సంగతి తెలిసిందే. దీంతో ముగ్గుల పండగ బాక్సాఫీస్​ పోరు తెలుగు ఆడియెన్స్‌లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఎవరు విన్న‌ర్​గా నిలుస్తారంటూ ప్రేక్ష‌కులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మ‌హేశ్​ బాబు(గుంటూరు కారం), వెంక‌టేశ్​(సైంధ‌వ్‌), నాగార్జున(నా సామిరంగ) వంటి స్టార్ హీరోల‌తో పాటు యంగ్ హీరో తేజ స‌జ్జా కూడా 'హ‌నుమాన్' చిత్రంతో బాక్సాఫీస్​ బ‌రిలో నిలిచారు. అయితే జనవరి 12న రానున్న 'గుంటూరు కారం', 'హనుమాన్'​ చిత్రాల మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. మహేశ్ లాంటి స్టార్ హీరోతో యంగ్ హీరో తేజ సజ్జా పోటీ పడటమే ఇందుకు కారణం.

అయితే ఈ సినిమాల విడుదల తేదీ దగ్గర పడే కొద్ది 'హ‌నుమాన్‌' క్రేజ్‌ రోజురోజుకూ మరింత పెరిగిపోతోంది. ఓ విషయంలో 'గుంటూరు కారం' కన్నా ఓ అడుగు ముందే నిలిచింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ యాప్‌ 'బుక్ మై షో' ఇంట్రెస్ట్ లిస్ట్​లో 'హ‌నుమాన్' మూవీ టాప్‌లో కొనసాగుతోంది. 'హ‌నుమాన్' సినిమా చూడ‌టానికి ఎక్కువ‌గా మంది ఆడియెన్స్ ఆస‌క్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టెడ్ లిస్ట్‌లో 'హ‌నుమాన్' సినిమా తాజాగా 228.4K (సుమారు 2 లక్షల 28 వేల మంది) ఆసక్తిని పొందింది. ప్రస్తుతం మరిన్ని ఇంట్రెస్ట్‌లను అందుకుంటూ దూసుకుపోతోంది. దీంతో అత్యధిక ఇంట్రెస్ట్‌లను అందుకున్న సంక్రాంతి చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీ (225.7K)ను కూడా క్రాస్ చేసింది. అలా పెద్ద సినిమా 'గుంటూరు కారం'కు ఈ చిత్రం గట్టి పోటినిస్తోంది.

ఇక 'హనుమాన్' చిత్రం విషయానికి వస్తే ఇందులో తేజ సజ్జాతో పాటు అమృత అయ్యర్ లీడ్​ రోల్​లో నటిస్తోంది. కోలీవుడ్​ నటి వరలక్ష్మి శరత్‌కుమార్, సీనియర్ డైరెక్టర్​ సముద్రఖని ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడులదైన ట్రైలర్ అభిమానుల్లో ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచింది. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అనుదీప్ దేవ్, హరి గౌర, జయ్ క్రిష్, కృష్ణ సౌరభ్‌లు ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సంక్రాంతి హీరోల రెమ్యునరేషన్​- మహేశ్, వెంకీ, నాగ్​, తేజ ఎన్ని రూ.కోట్లు తీసుకున్నారంటే?

'గుంటూరు కారం' ప్రీ రిలీజ్​ ఈవెంట్ వాయిదా- కారణం అదేనా?

Last Updated : Jan 6, 2024, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.