ETV Bharat / entertainment

ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న రాజమౌళి.. ప్రపంచ వేదికపై భారతీయత చాటిన జక్కన్న!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. న్యూయార్క్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రాజమౌళితో పాటు ఆయన సతీమణి కూడా హాజరయ్యారు.

Best Director Award To Rajamouli
SS Rajamouli
author img

By

Published : Jan 5, 2023, 12:46 PM IST

సినిమా ఇండస్ట్రీలో భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు ఎస్​.ఎస్​ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్​ఆర్ వంటి యూనిక్​ కథలను తెరకెక్కించి టాలీవుడ్​ ఇండస్ట్రీ కూడా హాలీవుడ్​కు ఏమాత్రం తీసిపోదు అని నిరూపించారు జక్కన్న. ఎపిక్ పీరియడ్ డ్రామా అయిన ఆర్ఆర్​ఆర్ ఇప్పటికే అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది. అయితే దీన్ని రూపొందించిన దర్శకుడు రాజమౌళి తాజాగా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఎన్​వైఎఫ్​సీసీ) వారు ఇచ్చే అరుదైన అవార్డ్​ను అందుకున్నారు. అనంతరం వేదికపై మాట్లాడారు.

"ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ వేదికపై అందరి ముందు నిలబడి మాట్లాడటం కాస్త భయంగా ఉంది. నా దృష్టిలో సినిమా అనేది ఓ దేవాలయం. చిన్నప్పుడు థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు పొందిన ఆనందం ఇప్పటికీ గుర్తుంది. నేను ఏ సినిమా తీసినా ప్రతి సీన్‌ను షూట్​ చేసేముందు.. ఈ సీన్‌ థియేటర్‌లో ఎలా ఉంటుందా అని ఒక ప్రేక్షకుడి​గా ఆలోచిస్తా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆకట్టుకోవడం కోసం నేను సినిమాలు చేస్తుంటాను. కానీ, ఆర్‌ఆర్‌ఆర్‌కు వచ్చేసరికి భారతీయులు ఎలాంటి అభిమానాన్ని చూపించారో.. అదే తరహా ప్రేమను, ఉత్సాహాన్ని విదేశాల్లోనూ చూశా. ఆర్‌ఆర్‌ఆర్‌పై విదేశీయులు సైతం అమితమైన ఆదరాభిమానాలు చూయించారు. సాధారణంగా కొందరు ఏదైనా సినిమా హిట్​ అయితే వారికి థ్యాంక్స్​ చzబుతూ సినిమా టీమ్​ మొత్తం నా కుటుంబం అని అంటుంటారు."

Rajamouli Family Pic
ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఉత్తమ డైరెక్టర్​ అవార్డు అందుకున్న తర్వాత సతీమణి రమతో రాజమౌళి

"కానీ, నా విషయంలో అది కాస్త డిఫరెంట్. ఎందుకంటే నా సినిమాల కోసం పనిచేసే ముఖ్యమైన వ్యక్తులందరూ నా సొంత కుటుంబసభ్యులే కావడం విశేషం. నేను తెరకెక్కించే సినిమాలకు నా తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథలు అందిస్తారు. పెద్ద అన్నయ్య కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తారు, నా సతీమణి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ పనులు చూసుకుంటుంది. నా కుమారుడు కార్తికేయ, వదిన వల్లి లైన్‌ ప్రొడ్యూసర్లుగా, సోదరుడి కుమారుడు కాలభైరవ గాయకుడిగా, మరో సోదరుడు రచయితగా.. ఇలా వీళ్లంతా నా సినిమాల్లో భాగమై ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తుంటారు. నేను అత్యున్నత స్థానంలో నిలవాలని వీరందరూ ఆకాంక్షిస్తుంటారు. ఇప్పటికి నేనందుకున్న విజయాలు కానీ భవిష్యత్​లో వచ్చే సక్సెస్​లు కానీ ఇవన్నీ నా కుటుంబం సహకారంతోనే.. అందుకే వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఈ సందర్భంగా హీరోలు రామ్​చరణ్​, ఎన్​టీఆర్​లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు" అంటూ కార్యక్రమం వేదికపై రాజమౌళి మాట్లాడారు.

రాజమౌళి తెరకెక్కించిన ఆర్​ఆర్​ఆర్​ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడి కేటగిరిలో ఆయనకు ఈ అవార్డును ఎన్​వైఎఫ్​సీసీ ప్రదానం చేసింది. అవార్డు ప్రదానోత్సవం న్యూయార్క్‌లోని టీఏఓ డౌన్‌టౌన్ రెస్టారెంట్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమౌళితో పాటు ఆయన సతీమణి రమా రాజమౌళి కూడా హాజరయ్యారు. వీరితో పాటు బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాత శోభు యార్లగడ్డ దంపతులు, రాజమౌళి కుమారుడు కార్తికేయ దంపతులు ఈవెంట్​కు అటెండ్​ అయ్యారు.

వేడుక ప్రారంభమయ్యే కొద్దిసేపటికి ముందు శోభు యార్లగడ్డ తన సోషల్​ మీడియా అకౌంట్​లో ఓ సెల్ఫీని షేర్​ చేశారు. ఫొటో పోస్ట్​ చేసిన కొద్దిసేపటికే అది వైరలయింది. ఫొటోలో రాజమౌళి వేసుకున్న డ్రెస్​పై నెటిజన్లు కామెంట్స్​ పెడుతున్నారు. భారతీయత ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణలో కనిపిస్తున్న రాజమౌళికి సూపర్​, లుకింగ్​ ఆసమ్​ అంటూ కాంప్లిమెంట్స్​ ఇస్తున్నారు. ఇందులో ఆయన ఆలివ్​ గ్రీన్​ కలర్​ కుర్తాతో పాటు ధోతీ కట్టుకొని కనిపించారు.
ఇకపోతే ఆర్ఆర్​ఆర్ తర్వాత కాస్త రిలాక్స్​ అయిన రాజమౌళి తన నెక్స్ట్​ ప్రాజెక్ట్​ సూపర్​ స్టార్​ మహేశ్​తో చేయనున్నట్లు ప్రకటించారు. మహేశ్​ బాబు నటించే ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టనప్పటికీ అడ్వెంచెరస్​ నేపథ్యంలో రానున్న ఈ సినిమా ఈ ఏడాది మధ్యలో సెట్స్​ పైకి వెళ్లనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.