ETV Bharat / entertainment

'ఏం మిస్‌ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది'.. హీరో గోపీచంద్‌ భావోద్వేగం - గోపిచంద్​ పక్కాకమర్షియల్​ రిలీజ్​ డేట్​

Pakka commercial Cash program: ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్‌ ప్రోగ్రామ్‌లో 'పక్కాకమర్షియల్'​ మూవీటీమ్​ పాల్గొని సందడి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోపిచంద్​ తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..

gopichand cash program
గోపిచంద్ క్యాష్ ప్రోగ్రామ్​
author img

By

Published : Jun 26, 2022, 3:30 PM IST

Pakka commercial Cash program: "నా తొమ్మిదేళ్ల వయసులో నాన్న చనిపోయారు. నేను ఏం మిస్‌ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది. నాన్న బతికి ఉన్నప్పుడు ఆయనతో ఎక్కువ సమయాన్ని ఎందుకు గడపలేకపోయానా? అని ఇప్పుడు అనిపిస్తుంటుంది" అంటూ ఉద్వేగానికి గురయ్యారు నటుడు గోపీచంద్‌. ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన తన తండ్రి కృష్ణను గుర్తు చేసుకున్నారు. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ ప్రోగ్రామ్‌లో తాజాగా 'పక్కా కమర్షియల్‌' టీమ్‌ సందడి చేసింది. సినిమా రిలీజ్‌ సందర్భంగా గోపీచంద్‌, దర్శకుడు మారుతి, నిర్మాతలు బన్నీ వాసు, ఎస్‌కెఎన్‌ ఈ షోలో పాల్గొని తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేశారు. చిత్రబృందంపై సుమ పంచులు.. దానికి మారుతి రివర్స్‌ కౌంటర్స్‌.. సుమ-గోపీచంద్‌ల ఫన్నీ స్కిట్స్‌తో ఇలా షో ఆద్యంతం ఫుల్‌ జోష్‌ఫుల్‌గా సాగింది. దీనికి సంబంధించిన సరికొత్త ప్రోమో తాజాగా విడుదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాగా, ఈ చిత్రంలో గోపీచంద్, రాశీఖన్నా.. లాయర్లుగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్​ మంచి రెస్పాన్స్​ను అందుకుంది. "వన్స్‌ వాడు కేసు ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లైంట్‌ అయినా బోనులో తడి గుడ్డేసుకుని కూర్చోవచ్చు" అనే ప్రారంభ డైలాగ్‌తోనే కథానాయకుడి పాత్రను ఎంత పవర్‌ఫుల్‌గా రూపొందించారో అర్థమవుతోంది. ఓవైపు యాక్షన్‌, మరోవైపు కామెడీతో గోపీచంద్‌ అదరగొట్టారు. జూనియర్‌ లాయరుగా రాశీఖన్నా కనిపించి, తనదైన మార్క్‌ నవ్వులను పంచింది. శ్రీనివాస్‌రెడ్డి, సప్తగిరి, వైవా హర్ష తమదైన శైలిలో గిలిగింతలు పెట్టించారు. మరి లాయరైన మన హీరో రౌడీమూకతో ఎందుకు ఫైట్‌ చేయాల్సి వచ్చింది? తన కన్నతండ్రే హీరోపై ఎందుకు ఛాలెంజ్‌ చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ 2 పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జేక్స్‌ బెజోయ్‌ సంగీతం అందించారు. ఈ సినిమా జులై 1న విడుదలకానుంది.

ఇదీ చూడండి: తెల్లచీర..కొంటె చూపులు..నడుము అందాలు...మతిపోగొడుతున్న తెలుగు పిల్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.