ETV Bharat / entertainment

Gaddar songs :'గద్దర్​'కు నంది అవార్డు తెచ్చిపెట్టిన వెండితెర​ సాంగ్స్​ తెలుసా?.. అసలా పేరు ఎలా వచ్చిందంటే?​ - Gaddar songs

Gaddar Movie songs : ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అన్యాయాలపై పోరాటం గద్దర్​ పాట..ఉద్యమాలకు ఊపిరి గద్దర్​ పాట..యువతకు ఉత్తేజం గద్దర్​ పాట. కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన ఆయన.. సిల్వర్​స్క్రీన్​పై తన పాటలతో మెరిశారు. నంది అవార్డు కూడా ఆయనకు వరించింది. ఆ సంగతులు..

Gaddar songs : 'గద్దర్​'కు నంది అవార్డు తెచ్చిపెట్టిన వెండితెర​ సాంగ్స్​ తెలుసా?.. అసలా పేరు ఎలా వచ్చిందంటే?​

author img

By

Published : Aug 6, 2023, 6:31 PM IST

Updated : Aug 6, 2023, 8:35 PM IST

Gaddar Movie songs : అన్యాయాలపై పోరాటం.. ఉద్యమాలకు ఊపిరి పోయడం.. యువతలో ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఆయన పాట వినిపించేది. తూటాలతోనే కాదు, పాటలతోనూ విప్లవాన్ని సృష్టించవచ్చని నిరూపించారు ప్రజా గాయకుడు గద్దర్‌. నేడు(ఆగస్ట్​ 6) గద్దర తుదిశ్వాస విడవడంతో ఉద్యమగళం మూగబోయినట్టైంది. ప్రజా సమస్యలపై పాట రూపంలో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్రవేసిన ఆయన.. వెండితెరపైనా కూడా పాటల రూపంలో మెరిశారు.

'మాభూమి' చిత్రం కోసం తొలిసారి పాట పాడి నటించారు గద్దర్​. ప్రజా సమస్యలను చూపిస్తూ రూపొందించిన చిత్రం మాభూమి. ఇందులో సాయిచంద్‌, రామిరెడ్డి, తెలంగాణ శకుంతల ప్రధాన పాత్రలు పోషించారు. గౌతమ్‌ ఘోష్ సినిమాను రూపొందించారు. ఈ చిత్రంలో 'బండెనక బండి కట్టి' సాంగ్​లో గద్దర్‌ కనిపిస్తారు. ఒకప్పుడు ఏ ప్రజా ఉద్యమం జరిగినా ఈ పాటే వినిపించేది.

ఆర్‌ నారాయణమూర్తి 'ఓరేయ్ రిక్షా' చిత్రంలోనూ గద్దర్‌ రాసిన 'మల్లెతీగకు పందిరి వోలే' పాట ఎవర్‌గ్రీన్​గా నిలిచింది. అన్నా చెల్లిళ్ల అనుబంధం తెలుపుతూ వచ్చిన ఈ పాట.. రాఖీ పండగ వచ్చిందంటే చాలు రేడియో, టీవీల్లో ఇదే వినిపిస్తుంది. ఈ సాంగ్​కు ఉత్తమ గేయ రచయితగా గద్దర్​కు, ఉత్తమ గాయకుడిగా వందేమాతరం శ్రీనివాస్‌లకు నంది అవార్డు కూడా వరించింది. కానీ దీన్ని వీరిద్దరూ తిరస్కరించారు.

2011లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో వచ్చిన 'జై బోలో తెలంగాణ' సినిమాలో గద్దర్ రాసిన 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా' సాంగ్‌.. ఉద్యమానికి కొత్త ఊపిరిలూదింది. ఈ సాంగ్​కు కూడా ఉత్తమ గాయకుడిగా నంది అవార్డు వరించింది. అలాగే ఆయన రాసిన 'అమ్మ తెలంగాణా ఆకలి కేకల గానమా' అనే పాట కూడా ​ తెలంగాణా రాష్ట్ర గీతంగా ఎంపిక చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గద్దర్​ పేరు ఎలా వచ్చిందంటే.. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన 1949లో జన్మించారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో 'ఆపర రిక్షా' అనే తన మొదటి పాటను రాశారు విఠల్​ రావు. అలా ఆయన మొదటి ఆల్బంకు గద్దర్ అనే పెట్టారు. ఆ తర్వాత ఆ పేరే ఆయన పేరుగా ఉండిపోయింది. 1975లో ఓ బ్యాంకులోనూ గద్దర్​ క్లర్క్​గా పనిచేశారట. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. పిల్లల్లో ఒకరు కొనేళ్ల క్రితం కన్నుమూశారు.

Gaddar Passed Away : ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత

Leaders Condolence on Gaddar Death : 'గద్దర్​ అకాల మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు'

Last Updated : Aug 6, 2023, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.