ETV Bharat / entertainment

ఎన్టీఆర్ ​ఒక్కో యాడ్​​కు ఎంత తీసుకుంటారో తెలుసా! - జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో

'ఆర్​ఆర్​ఆర్'​ సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్​. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు యాడ్స్​లో​ కూడా నటిస్తున్నారు తారక్​. అయితే ఆయన చేస్తున్న యాడ్స్​కు రెమ్యునరేషన్​ ఎంత తీసుకుంటున్నారనే దానిపై ఓ చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆయన పారితోషికం ఎంతంటే..

ntr
ఎన్టీఆర్​
author img

By

Published : Nov 27, 2022, 5:46 PM IST

Updated : Nov 27, 2022, 5:56 PM IST

'ఆర్ఆర్ఆర్' సినిమాతో ఎన్టీఆర్​ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవలే ఈ సినిమాను జపాన్​లో కూడా విడుదల చేశారు మేకర్స్. అక్కడ కూడా 'ఆర్ఆర్ఆర్' మంచి హిట్​ను అందుకుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. యాడ్స్ షూటింగ్​లో బిజీగా ఉంటున్నారు.

ఇటీవలే ఎన్టీఆర్.. 'లిషియస్' అనే ఓ ప్రముఖ మాంసం డెలివరీ సంస్థకు సంబంధించిన యాడ్​లో కనిపించారు. కాగా ఈ యాడ్ తక్కువ సమయంలోనే వైరల్ అయింది. ప్రస్తుతం తెలుగులో వచ్చే యాడ్స్ మాత్రమే చేస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఓక్కో ప్రకటన కోసం రూ.3 కోట్లు నుంచి రూ.4 కోట్లు తీసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలు యాడ్స్ కోసం తీసుకునే రెమ్యునరేషన్​తో పోలిస్తే తక్కువేనని సమాచారం.

ఎన్టీఆర్ ఇంత తక్కువకి యాడ్ చేయడం వెనుక కారణం కూడా ఉందంటున్నారు సినీ నిపుణులు. తారక్ గతంలోనూ పలు యాడ్స్​లలో చేసినా.. అవి చాలా తక్కువే. మొదట ఇలాంటి ప్రముఖ సంస్థల యాడ్స్ చేస్తూ.. త్వరలో ఇండియా లెవల్​లో చేయాలనే ఆలోచనలో ఉన్నారట తారక్.
మరోవైపు సినిమాల విషయంలో ఎన్టీఆర్ ఫుల్ జోష్​లో ఉన్నారు. త్వరలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమాపైనా భారీ అంచనాలే ఉన్నాయి. మొదట్లో ఈ సినిమా ఆగిపోతున్నట్లు వార్తలు వచ్చినా.. తర్వాత పట్టాలెక్కనుందని క్లారిటీ ఇచ్చింది మూవీ టీమ్. ఇప్పటికే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ మొదలుపెట్టే అశకాశాలు ఉన్నాయి.

ఇవీ చదవండి: 'మహేశ్​ అన్న మాటకు చాలా బాధపడ్డాను.. కానీ ఎప్పటికైనా..'

'హిట్-2' ప్రీరిలీజ్​ ఈవెంట్​కు గెస్ట్​గా జక్కన్న.. సెంటిమెంట్​ వర్కౌట్​ అవుతుందా?

Last Updated : Nov 27, 2022, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.