Dunki vs Salaar : వింటర్ సీజన్ మొదలైన వేళ సినీ ప్రేక్షకులకు పండుగ సీజన్ కూడా వచ్చేసింది. ఇప్పటికే 'యానిమల్' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ నెలలో విడుదల కానున్న రెండు భారీ సినిమాలపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అటు 'సలార్'తో పాటు ఇటు 'డంకీ' కూడా ఒకేసారి థియేటర్లలోకి రానున్న తరుణంలో ఇరు స్టార్ల అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ అడ్వాన్స్ బుక్కింగ్స్‌ను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ వీకెండ్స్‌లో టికెట్లు విక్రయమవ్వనున్నాయని సమాచారం. అయితే ఓవర్సీస్లో మాత్రం కొద్ది రోజుల క్రితమే బుకింగ్స్ మొదలయ్యాయి. దీంతో అభిమానులు కూడా భారీ సంఖ్యలోనే ఈ రెండు సినిమాల టికెట్లను కొనుగోలు చేశారు. యూఎస్‌లో 'సలార్' డిసెంబర్ 21న విడులవ్వనుంది. దీంతో ఇప్పటి వరకు 347 లొకేషన్స్‌లో దాదాపు 1119 షోలు రన్ అవ్వనున్నాయని సమాచారం. అయితే సుమారు 22,000 టిక్కెట్ల విక్రయాల ద్వారా 'సలార్'కు ఇప్పటి వరకు 593,657 డాలర్లు (దాదాపు రూ. 4.94 కోట్లు) వసూలయ్యాయట. దీంతో యూఎస్‌లో ఈ సినిమాకు ఎంత క్రేజ్ ఉందో ఇట్టే అర్థమైపోయింది.
Dunki Advance Bookings : మరోపైపు 'డంకీ'కి కూడా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ అయినట్లు సమాచారం. సుమారు 328 లొకేషన్స్‌లోని 925 షోలకు దాదాపు 6514 టిక్కెట్లు అమ్ముడయ్యాయని టాక్ నడుస్తోంది. దీని ద్వారా సుమారు 90,292 డాలర్లు అంటే దాదాపు రూ. 75 లక్షలు) వసూలయ్యాయని సమాచారం. అయితే ఈ రెండు చిత్రాలకు సమానమైన స్క్రీన్స్ లభించినప్పటికీ 'వాన్కా', 'ఆక్వామాన్' 'ది లాస్ట్ కింగ్డమ్' లాంటి ల బ్లాక్బస్టర్లతో పోటీ పడే అవకాశాలున్నాయి. అయితే ఈ రెండింట్లే ఏ చిత్రం అభిమానులను ఆకట్టుకుని బాక్సాఫీస్ ముందు బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రిలీజ్‌కు ఇంకా పదిరోజులే- సలార్ ప్రమోషన్లు ఎక్కడ బాసూ?
నెటిజన్‌కు షారుక్ ఖాన్ దిమ్మతిరిగే కౌంటర్- మందులు పంపిస్తా తగ్గుతుందంటూ!