జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. దర్శకధీరుడు జక్కన్న తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తారక్. కేవలం భారతీయులే కాదు.. విదేశాల్లోనూ ఎన్టీఆర్‌కు వీరాభిమానులు ఉన్నారు. కేవలం నటనలోనే కాదు ప్రవర్తనలోనూ తారక్ కాస్త ప్రత్యేకమనే చొప్పొచ్చు.
తాజాగా తారక్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. అదే ఎన్టీఆర్ ముద్దు పేరు. అభిమానులంతా తారక్‌ను యంగ్ టైగర్ అంటూ పిలుచుకుంటారు. మరికొందరు తారక్ అని పిలుస్తుంటారు. సినీ పరిశ్రమలో ఎన్టీఆర్‌ను సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, నిర్మాతలు అందరూ తారక్ అనే పిలుస్తారు. కానీ ఇంట్లో ఆయనను ఏమని పిలుస్తారో తెలుసా?
గతంలో ఓ షో ప్రమోషన్లలో పాల్గొన్న తారక్ .. తనను ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తుంటారని చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా ఓ పేరు అనేది లేదని అన్నారు. "ఇంట్లో మా అమ్మగారు ఓ పేరు పెట్టి పిలుస్తారు.. పలుకుతాను.. అలాగే నా భార్య లక్ష్మి ప్రణతి ముద్దుగా ఓ పేరు పెట్టి పిలుస్తుంది పలుకుతాను.. మా పిల్లలు నాన్న అని పిలుస్తారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నా.. తారక్ అన్నా.. రామారావు అన్నా పలుకుతాను. ప్రేమగా ఎలా పిలిచిన నాకు ఓకే.. ఇలాగే పిలవండి అని ఎప్పుడూ చెప్పను" అని అన్నారు.
ఇటీవలే 'ఆర్ఆర్ఆర్' సినిమాతో సత్తా చాటిన ఎన్టీఆర్.. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.