ETV Bharat / entertainment

హాట్​బ్యూటీతో బాలయ్య ఆటాపాట.. వెంకీ చెల్లెలిగా పూజాహెగ్డే! - salmankhan pooja hegdey movie

మరికొన్ని సినిమా కబుర్లు వచ్చేశాయి. వాటిలో బాలకృష్ణ, వెంకటేశ్​, సల్మాన్​ఖాన్​, పూజాహెగ్డే చిత్రాల సంగతులు ఉన్నాయి.

Balakrishna 107 movie
హాట్​బ్యూటీతో బాలయ్య ఆటాపాట
author img

By

Published : May 16, 2022, 7:52 PM IST

Updated : May 16, 2022, 9:31 PM IST

Balakrishna Gopichand malineni movie: బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సెట్స్‌ని తీర్చిదిద్దారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ప్రస్తుతం స్పెషల్​ సాంగ్​ రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో డింపుల్ హయాతి ఆడిపాడనున్నట్టు సమాచారం. ఇప్పటికే 'ఖిలాడి' సినిమాలో రవితేజ సరసన హీరోయిన్​గా నటించి తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సాంగ్​లోనూ తన అందచందాలతో ఆకట్టుకోబోతుంది. కాగా, ఈ చిత్రంలో దునియా విజయ్‌ ప్రతినాయకుడిగా, వరలక్ష్మీ శరత్​కుమార్​ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Venkatesh Salman khan movie: బాలీవుడ్ స్టార్​ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'కభీ ఈద్ కభీ దివాలీ'. ఫర్హాద్ సామ్‌జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్​గానే సినిమా షూటింగ్​ను ప్రారంభమైంది. ఇప్పుడీ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ మూవీలో పూజాహెగ్డే.. వెంకటేష్​కి చెల్లెలిగా కనిపించనుందట. వెంకీ, పూజా ఇద్దరూ ఈ సినిమాలో నటిస్తుండడంతో తెలుగునాట కూడా ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం ముంబయిలోని విలేపార్లేలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో షూటింగ్ జరుపుతున్నారు. త్వరలోనే వెంకీ ఈ సినిమా సెట్స్​లో జాయిన్ కానున్నారు.

ఇదీ చూడండి: 'స్పిరిట్'​పై కియారా రియాక్షన్​.. 'విక్రమ్'​లో సూర్య కన్ఫామ్​!

Last Updated : May 16, 2022, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.