ETV Bharat / entertainment

దేవీశ్రీకి బంఫర్​ ఆఫర్​.. సల్మాన్​ఖాన్​తో మరోసారి! - devisriprasad salman khan movies

Salmankhan Devisriprasad: టాలీవుడ్​ ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్​కు మరో బంపర్​ ఆఫర్​ వరించినట్లు తెలుస్తోంది. ఆయనకు బాలీవుడ్​ భాయ్​ సల్మాన్​ఖాన్​తో కలిసి మరోసారి పనిచేసే అవకాశం వచ్చిందని సమాచారం.

salman khan devisri prada
సల్మాన్​ దేవీ శ్రీ ప్రసాద్​
author img

By

Published : Apr 17, 2022, 11:36 AM IST

Updated : Apr 17, 2022, 11:50 AM IST

Salmankhan Devisriprasad: టాలీవుడ్​ ప్రముఖ సంగీత దర్శకుల్లో రాక్​స్టార్​ దేవీ శ్రీ ప్రసాద్​ ఒకరు. తన సంగీతంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. తెలుగులో బిజీగా ఉండటం వల్ల కుదిరినప్పుడల్లా మిగతా భాషల్లోనూ తన మ్యూజిక్​తో మ్యాజిక్​ చేస్తుంటారు. అలా సల్మాన్ ఖాన్​ నటించిన 'జయహో'తో బాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత పలు చిత్రాలకు సంగీతమందించారు. అందులో 'రెడీ'(డింక చికా సాంగ్​), 'రాధే'కు (సీటీమార్​) మాస్​ ట్యూన్స్​ ఇచ్చి శ్రోతల్ని మెప్పించారు.

అయితే ఇప్పుడు దేవీ మరోసారి సల్మాన్​తో కలిసి పనిచేయనున్నారని తెలిసింది. భాయ్​ నటించబోయే కొత్త చిత్రం 'కభీ ఈద్​ కభీ దివాళీ'కి సంగీతం అందించనున్నారని సమాచారం. మ్యూజిక్​ ప్రాధాన్యమున్న కథ కావడం వల్ల దేవీశ్రీ పేరును సల్మాన్​ సూచించారట. అయితే డీఎస్పీతో పాటు ఇంకొంతమంది సంగీత దర్శకులు కూడా ఈ చిత్రానికి పనిచేయనున్నారు. కాగా, ప్రస్తుతం ఈ సినిమా కోసం ముంబయిలో ఓ భారీ సెట్​ను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో టాలీవుడ్​ సీనియర్​ హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించనుండగా.. పూజాహెగ్డే హీరోయిన్​గా నటించనుంది. ఫర్మాద్ సమ్జీ దర్శకుడు.

ఇదీ చూడండి: రవితేజ కోసం భారీ ఖర్చు.. సెట్​ కోసమే అన్ని కోట్లా?

Last Updated : Apr 17, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.