ETV Bharat / entertainment

సామ్​కు జోడీగా 'శాకుంతలం'లో ఆ స్టార్​ హీరో.. ఫస్ట్​ లుక్​ చూశారా? - శాకుంతలం మూవీ న్యూస్​

సమంత హీరోయిన్​గా తెరకెక్కుతున్న 'శాకుంతలం' మూవీ నుంచి కొత్త అప్డేట్​ వచ్చింది. సామ్​కు జోడీగా దుష్యంత మహారాజు పాత్రలో కనిపించనున్న మలయాళం హీరో ఫస్ట్​లుక్​ను మేకర్స్​ రిలీజ్​ చేశారు.

Shaakuntalam movie update
Shaakuntalam movie update
author img

By

Published : Sep 18, 2022, 12:39 PM IST

Actor Devmohan Shakunthalam Movie : టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చరిత్రాత్మక చిత్రం 'శాకుంతలం'. ఈ మూవీలో ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ కనిపంచనున్నారు. ఆదివారం దేవ్ మోహన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫస్ట్​ లుక్​ను మేకర్స్​ విడుదల చేశారు. ఓ తెల్లటి గుర్రంపై గంభీరంగా దేవ్​ మోహన్​ కూర్చుని ఉన్న ఫొటోను షేర్​ చేసింది చిత్రబృందం. 'హ్యాపీ బర్త్ డే టు అవర్ ఛార్మింగ్ అండ్ వాలియంట్ కింగ్ దుష్యంత్' అంటూ చిత్రబృందం మోహన్​కు విషెస్​ చెప్పింది.

గుణశేఖర్​ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ పాన్​ ఇండియా మూవీలో పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కింగ్ అసుర పాత్రలో 'జిల్' మూవీ ఫేమ్ కబీర్ సింగ్ కనిపించనున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ 'శాకుంతలం' సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా కనువిందు చేయనుంది. అయితే ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

ఇదీ చదవండి: అలాంటి పాత్రలు చెయ్యొద్దని డాక్టర్లు సలహా ఇచ్చారు: హీరో శర్వానంద్​

మరోసారి జోడీగా రణ్​బీర్​- ఆలియా?.. ఇదిగో క్లారిటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.