ETV Bharat / entertainment

వేసవి కానుకగా దసరా రిలీజ్,​ తరుణ్​ భాస్కర్ కొత్త సినిమా షురూ - రంగరంగ వైభలం

Dasara Movie Release Date నేచురల్​ స్టార్​ నాని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం దసరా. వేసవి కానుకగా వచ్చే ఏడాది మార్చి 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న కీడా కోలా చిత్రాన్ని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు.

Dasara Movie Release Date
Dasara Movie Release Date
author img

By

Published : Aug 26, 2022, 5:07 PM IST

Updated : Aug 26, 2022, 6:48 PM IST

Dasara Movie Release Date: 'అంటే.. సుందరానికీ' తర్వాత నాని నటిస్తోన్న సరికొత్త చిత్రం 'దసరా'. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వేసవి కానుకగా వచ్చే ఏడాది మార్చి 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను నాని షేర్‌ చేస్తూ .. 'ఎట్లైతే గట్లనే సూస్కుందామ్‌. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది' అని రాసుకొచ్చారు. సిల్క్ స్మిత బొమ్మ గీసి ఉన్న గోడ ముందు మద్యం బాటిల్‌ చేతిలో పట్టుకుని నాని కూర్చున్నట్లు రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో చూపించారు.

గోదావరిఖని నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న సినిమా ఇది. సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో కథ సాగుతుంది. కుటుంబ డ్రామాగా రూపొందుతోంది. నాని పాత్ర పూర్తి విభిన్నంగా ఉండనుంది. ఇందులో ఆయన ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఇందులో నానికి జోడీగా కీర్తి సురేశ్‌ సందడి చేయనున్నారు.

తరుణ్ భాస్కర్ కొత్త చిత్రం ప్రారంభం: 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు తరుణ్ భాస్కర్.. మరో వైవిధ్యమైన చిత్రానికి శ్రీకారం చుట్టారు. బొద్దింకతో క్రైమ్ కామెడీ డ్రామాగా 'కీడా కోలా' అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. విజి సైన్మా పతాకంపై తొలి చిత్రంగా నిర్మిస్తున్న ఈ సినిమాను.. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతోపాటు యువ కథానాయకులు సిద్ధార్థ్, తేజ సజ్జా, నందు సహా పలువురు దర్శకులు హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ చిత్రానికి నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్న చిత్ర బృందం.. కీడా కోలాను 2023లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా పూజకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది.

'రంగరంగ వైభవంగా' నుంచి టైటిల్ సాంగ్​: 'ఉప్పెన'తో హీరోగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు పొందాడు వైష్ణవ్‌ తేజ్‌. రెండో ప్రయత్నం.. 'కొండపొలం' చిత్రంతో యువతలో స్ఫూర్తి నింపిన ఆయన ప్రస్తుతం ఓ ప్రేమ కథలో నటిస్తున్నారు. అదే 'రంగరంగ వైభవంగా'. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్​. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్​ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో వైష్ణవ్‌ సరసన కేతికా శర్మ నటిస్తోంది. వీరిద్దరూ రిషి, రాధ పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొబ్బరికాయ కొట్టారు: ప్రభాస్‌ - మారుతి కలయికలో సినిమా అధికారికంగా ఖరారైనట్టే. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు గురువారం కొబ్బరికాయ కొట్టారు. నిర్మాణ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాల్ని జరిపారు. ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో సినిమా గురించి చాలా రోజులుగా పరిశ్రమలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.

మరోపక్క ప్రభాస్‌ ఇతర సినిమాలతో బిజీ కావడం వల్ల ఈ కలయికలో సినిమా ఇప్పట్లో ఉంటుందా? లేదా? అనే సందేహం ఏర్పడింది. ఎట్టకేలకు ఆ సందేహాలకి ఫుల్‌స్టాప్‌ పడింది. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశాలున్నట్టు తెలిసింది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా ముగ్గురు కథానాయికలు నటిస్తారు. వివేక్‌ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తారు.

ఇవీ చదవండి: హీరో నిఖిల్​ ఆవేదన, ఆయనలేకే ఈ కష్టాలంటూ

అనసూయ ఫైనల్ వార్నింగ్, ఆ కామెంట్స్​ చేసిన వారందరిపై కేసులు

Last Updated : Aug 26, 2022, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.