ETV Bharat / entertainment

రూ.100 కోట్ల క్లబ్​లోకి 'దసరా'.. నాని కెరీర్​లో ఫస్ట్​ మూవీగా రికార్డ్​! - దసరా వంద కోట్లు

నేచరుల్​ స్టార్​ నాని నటించిన దసరా చిత్రం బాక్సాఫీస్​ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా వంద కోట్ల క్లబ్​లోకి చేరింది.

dasara movie box office collections
dasara movie box office collections
author img

By

Published : Apr 5, 2023, 10:20 PM IST

టాలీవుడ్​ నేచురల్​ స్టార్​ నటించిన దసరా సినిమా బాక్సాఫీస్​ వద్ద దుమ్మురేపుతోంది. భారీ వసూళ్లతో అదరగొడుతోంది. నాని కెరీర్​లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. తాజాగా ఈ చిత్రం వంద కోట్ల క్లబ్​లోకి చేరింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ధరణి తన నటనతో బాక్సాఫీస్​ కొల్లగొట్టాడని ట్వీట్​ చేసింది. దాంతో పాటు స్పెషల్​ పోస్టర్​ను విడుదల చేసింది.

dasara movie box office collections
ప్రభాస్​ ఇన్​స్టా స్టోరీ

అయితే ఆ పోస్టర్​ను పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​.. ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో షేర్​ చేశారు. 'దసరా సినిమా బాక్సాఫీస్​ వద్ద వంద కోట్ల మార్క్​ దాటింది. ఈ మువీ హీరో నాని, హీరోయిన్​ కీర్తి సురేశ్​, దర్శకుడు శ్రీకాంత్​ ఓదెలకు కంగ్రాట్స్' అంటూ క్యాప్సన్​ ఇచ్చారు. బుధవారం.. సాయంత్రం దసరా చిత్ర బృందం.. దసరా బ్లాక్‌బస్టర్‌ దావత్‌ పేరిట సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అయితే ఈ సినిమాను పలువురు సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. టాలీవుడ్​ దర్శక దిగ్గజం రాజమౌళి 'దసరా'లో నటించిన నేచురల్​ స్టార్​ నానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాతో నాని తన కెరీర్​లోనే అత్యుత్తమమైన నటనను ప్రదర్శించాడని కొనియాడారు. హీరోయిన్​ కీర్తి సురేశ్​​ కూడా వెన్నెల క్యారెక్టర్​లో ఒదిగిపోయి అవలీలగా నటించందంటూ మెచ్చుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. వాస్తవ ప్రపంచంలో పాత్రల మధ్య హృదయానికి హత్తుకునే ఓ గొప్ప లవ్ స్టోరీని తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతాన్ని కూడా ప్రత్యేకంగా అభినందించారు రాజమౌళి.

అంతకుముందు సూపర్​స్టార్​ మహేశ్​ బాబు కూడా మూవీ టీమ్​పై ప్రశంసల వర్షాన్ని కురిపించారు. సినిమా చాలా బాగుందని, ఈ విషయానికి తాను ఎంతగానో గర్విస్తున్నానని అన్నారు. ఇక ఈ ట్వీట్​కు రిప్లై ఇస్తూ మహేశ్‌కు ధన్యవాదాలు చెప్పింది చిత్ర నిర్మాణ సంస్థ. అంతే కాకుండా హీరో నాని కూడా మహేశ్​ నుంచి ఇలాంటి కామెంట్స్ రావడం.. పోకిరి సినిమాకు మణిశర్మ సంగీతం లాగా ఉందని రిప్లై ఇచ్చారు .

నాని నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం 'దసరా'. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ హీరోయిన్​గా అలరించింది. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 30న మొత్తం 5 భాషల్లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్​ వైడ్​గా దాదాపు 3 వేలకుపైగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. రిలీజైన మొదటి​ రోజు నుంచే తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.