Siddhaanth Vir Surryavanshi Passes Away: గత కొద్దికాలం నుంచి చిత్రసీమలో మరణాల సంఖ్య ఎక్కువైంది. ముఖ్యంగా తక్కువ వయసులోనే గుండెపోటుతో మరణించే వారి నటుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు మళ్లీ మరో నటుడు ఇదే కారణంగా ప్రాణాలు విడిచారు. శుక్రావారం బుల్లితెర నటుడు సిద్ధాంత్ సూర్యవంశీ(46) జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా అకస్మాతుగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని మరో టెలివిజన్ నటుడు జై భానుశాలి తెలిపారు. సిద్ధాంత్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
![Control Room Actor Siddhaanth Vir Surryavanshi dies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16899609_875_16899609_1668160488608.png)
మోడలింగ్ నుంచి బుల్లితెర నటుడిగా మారారు సిద్ధాంత్. 'కుసుమ్' అనే సీరియల్ ద్వారా టెలివిజన్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన 'కంట్రోల్ రూమ్' అనే ధారావాహికలో ప్రధాన పాత్ర అయిన శాంతాను వ్యాస్ అనే డీసీపీ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ పాత్ర ఆయనకు ఎంతో గుర్తింపునిచ్చింది. ఇంకా కసౌతి జిందగీ కే, కృష్ణ అర్జున్, క్యా దిల్ మె హై వంటి షోస్‌లోనూ సిద్ధాంత్ మెరిశారు. ఆయన సూపర్‌మోడల్ అలేసియా రౌత్(Alesia)ను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ చూడండి: అమ్మో కృతిసనన్ వేసుకున్న డ్రెస్ అంత కాస్ట్లీనా మరి రకుల్ ది ఎంతో