ETV Bharat / entertainment

మెగా 156 'విశ్వంభర' టైటిల్ కాన్సెప్ట్ వీడియో - డిజైన్ చేసింది ఈయనే! - విశ్వంభర టైటిల్ కాన్సెప్ట్

Chiranjeevi Mega 156 Vishwambhara Title Concept Video : మంచి రెస్పాన్స్ అందుకుంటున్న మెగా 156 'విశ్వంభర' టైటిల్​ కాన్సెప్ట్​ వీడియోను డిజైన్​ చేసింది ఎవరంటే?

మెగా 156 'విశ్వంభర' టైటిల్ కాన్సెప్ట్ వీడియో - డిజైన్ చేసింది ఈయనే

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 7:10 PM IST

Chiranjeevi Mega 156 Vishwambhara Title Concept Video Anil Kumar Upadyayula : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'. బింబిసార వంటి హిట్ తర్వాత వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలను మరింత పెంచేలా సంక్రాంతి సందర్భంగా టైటిల్ కాన్సెప్ట్​ వీడియోను రిలీజ్​ చేశారు. ఆ వీడియో మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ టైటిల్ కాన్సెప్ట్ గ్లింప్స్​ బాగుందంటూ ఆడియెన్స్, మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. వీడియోలోని గ్రాఫిక్స్ విజువల్స్​ అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు.

అయితే ఈ టైటిల్ కాన్సెప్ట్ వీడియోను డిజైన్ చేసింది ఎవరో తెలుసా? అతని పేరే అనిల్ కుమార్ ఉపాధ్యాయుల. అసోసియేట్ డైరెక్టర్​గా యూవీ క్రియేషన్స్ బ్యానర్​లో పలు సినిమాలకు పని చేశారు. త్వరలోనే డైరెక్టర్​గా మారి మెగా ఫోన్ కూడా పట్టుకోబోతున్నారని బయట కథనాలు వస్తున్నాయి.

అనిల్ కుమార్ - రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో' సినిమాతో పాటు 'రాధేశ్యామ్'​కు కూడా పని చేశారు. 'రాధేశ్యామ్'​ చిత్రంలోని 'నీ రాతలే' సాంగ్​కు కాన్సెప్ట్ డిజైన్ చేసి పిక్చరైజ్ చేశారు. ఇకపోతే త్వరలోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్​లో అఖిల్ అక్కినేని హీరోగా ఓ భారీ సినిమా రాబోతుంది. ఈ చిత్రంతో అనిల్ కుమార్​ దర్శకుడిగా గ్రాండ్​ డెబ్యూ ఇవ్వబోతున్నారని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్​మెంట్​ రాబోతుందట. ప్రస్తుతం మెగా 156 విశ్వంభర టైటిల్ కాన్సెప్ట్ చూసిన నెటిజన్లు, సినీప్రియులు అనిల్ కుమార్ వర్క్ చూస్తుంటే టాలీవుడ్​లో మరో టాలెంటెడ్ డైరెక్టర్​గా పేరు తెచ్చుకుంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

'మెగా 156' - కళ్లుచెదిరేలా టైటిల్​ గ్లింప్స్​ - రిలీజ్ డేట్ ఇదే

సంక్రాంతి బాక్సాఫీస్​ - బాలయ్య మెచ్చిన సినిమా ఇదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.