ETV Bharat / entertainment

God Father: మరో పవర్​ఫుల్ సాంగ్​ రిలీజ్​.. చిరు యాక్షన్ సూపర్​ - గాడ్​ఫాదర్​ నజభజ సాంగ్​

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్​ఫాదర్ సినిమా నుంచి మరో అదిరిపోయే సాంగ్ రిలీజ్ అయింది. ఇది కూడా ఫ్యాన్స్​ను ఆకట్టుకునేలా ఉంది.

godfather song release
గాడ్​ఫాదర్​ సాంగ్ రిలీజ్​
author img

By

Published : Sep 27, 2022, 5:28 PM IST

Updated : Sep 27, 2022, 5:36 PM IST

మెగాఫ్యాన్స్​కు మరో సర్​ప్రైజ్​ ఇచ్చింది గాడ్​ఫాదర్​ మూవీటీమ్​. చిత్రంలోని మరో పవర్​ఫుల్​ సాంగ్​ను రిలీజ్ చేసింది. నజభజ అంటూ సాగే ఈ సాంగ్​ను యాక్షన్​ నేపథ్యంలో చిత్రీకరించారు. ఇందులో​ చిరు యాక్షన్​ సన్నివేశాలు అదిరిపోయాయి. అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. కథానాయకుడి వ్యక్తిత్వాన్ని వివరించే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్‌ రాశారు. శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర ఆలపించారు. తమన్‌ స్వరాలందించారు. 'అడవి తల్లికి అన్నయ్య వీడురా.. కలబడితే కథకళిరా' చరణాలు పవర్‌ఫుల్‌గా సాగాయి. కాగా, ఇటీవలే 'తార్‌ మార్‌ తక్కర్‌ మార్‌' పాట కూడా విడదలై మంచి రెస్పాన్స్​ అందుకుంది. ఇందులో సల్మాన్​, చిరు కలసి చిందులేశారు.

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించిన చిత్రమిది. మలయాళ హిట్‌ సినిమా 'లూసిఫర్‌'కు రీమేక్‌గా రూపొందింది. ఈ పొలిటికల్‌ యాక్షన్‌ మూవీలో సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. రామ్‌చరణ్‌, ఆర్‌.బి. చౌదరి, ఎన్‌.వి. ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 5న తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: ఊర్రూతలూగిస్తున్న బాలయ్య 'అన్​స్టాపబుల్'​ యాంథమ్​.. అదిరిపోయింది అంతే!

Last Updated : Sep 27, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.