ETV Bharat / entertainment

'అదరగొట్టావ్ అల్లుడు.. కమ్‌బ్యాక్ దద్దరిల్లింది!'.. సాయిధరమ్‌పై చిరు కామెంట్స్ - విరూపాక్షసాయి ధరమ్​ తేజ్​

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' శుక్రవారం (ఏప్రిల్​ 21) విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ వినిపిస్తుండటం వల్ల ట్విట్టర్ వేదికగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఆనందం వ్యక్తంచేస్తూ అల్లుడికి కంగ్రాట్స్ తెలిపారు.

virupaksha sai dharam tej
virupaksha sai dharam tej
author img

By

Published : Apr 21, 2023, 7:33 PM IST

గతేడాది యాక్సిడెంట్‌కు గురైన తర్వాత సాయిధరమ్ తేజ్ కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరమయ్యారు. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత 'విరూపాక్ష' మూవీతో నేడు (ఏప్రిల్ 21) ప్రేక్షకుల ముందుకొచ్చారు. కార్తీక్ వర్మ దండు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సోనియా సింగ్ ఫిమేల్ లీడ్స్‌గా నటించారు. తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు. అయితే విడుదలైన మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద 'విరూపాక్ష' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో సాయిధరమ్‌కు ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో ఆయన మేనమామ, మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ.. సాయిధరమ్‌ తేజ్‌కు కేక్ తినిపిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ స్పెషల్ నోట్ యాడ్ చేశారు. "విరూపాక్ష గురించి అద్భుతమైన రిపోర్ట్స్ వినబడుతున్నాయి! ఈ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను డియర్ తేజు. నీ కమ్‌బ్యాక్ దద్దరిల్లింది. ఈ సినిమాను ప్రేక్షకులు అభినందిస్తున్నందుకు, ఆశీర్వదిస్తున్నందుకు ఆనందంగా ఉంది. టీమ్‌ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు చిరు. ఈ మేరకు హీరోయిన్ సంయుక్త, డైరెక్టర్ కార్తిక్ వర్మ, మ్యూజిక్ డైరెక్టర్ అజనీస్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్, ఎడిటర్ నవీన్ నూలిని ట్యాగ్ చేశారు.

virupaksha sai dharam tej
చిరంజీవి ట్వీట్​

'విరూపాక్ష' సినిమా విషయానికొస్తే.. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించగా.. శ్యామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. వీళ్లిద్దరి వర్క్‌కు ప్రశంసలు లభిస్తున్నాయి. మొత్తానికి సాయిధరమ్ తేజ్ 'విరూపాక్ష' మూవీతో తన కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటుకున్నారు.

యాక్సిడెంట్ తర్వాత మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తనకు ఎంత సపోర్ట్‌గా నిలిచారో సాయిధరమ్ రీసెంట్ ఇంటర్వ్యూలో వెల్లడించడం తెలిసిందే. కోలుకున్న తర్వాత షూటింగ్‌కు వచ్చినపుడు మాట్లాడేందుకు కష్టపడ్డానని, పట్టుదలతో ప్రాక్టీస్ చేసి గాడిలో పడ్డానని చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం సాయిధరమ్ పడ్డ కష్టం కోసమైనా సినిమా హిట్ కావాలని అభిమానులందరూ కోరుకున్నారు. అనుకున్నట్లుగానే 'విరూపాక్ష' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.

ప్రస్తుతం డైరెక్టర్‌ కార్తీక్ దండు, సాయిధరమ్‌ తేజ్‌ ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇద్దరూ ఒకరినొకరు హగ్‌ చేసుకుని.. అభిమానుల సమక్షంలో సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటున్న వీడియోతోపాటు థియేటర్‌లో ప్రేక్షకుల మధ్యలో హీరోహీరోయిన్లు సినిమా వీక్షిస్తున్న విజువల్స్‌ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదలైన విరూపాక్ష టీజర్‌, టైటిల్ గ్లింప్స్ వీడియో, ట్రైలర్‌ సినిమాపై క్రియేట్‌ చేసిన బజ్.. సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయంటున్నారు ట్రేడ్‌ పండితులు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.