డీసీ కామిక్స్‌లో బ్యాట్‌మ్యాన్‌కు ఉన్న క్రేజే వేరు. అయితే ఆ క్యారెక్టర్‌ను ఆడియెన్స్‌కు మరింత కనెక్ట్ చేసిన వ్యక్తి మాత్రం కెవిన్ కాన్రాయ్. గంభీరమైన స్వరంతో 'ఐ యామ్ వెన్‌జెన్స్.. ఐ యామ్ ది నైట్.. ఐ యామ్ బ్యాట్‌మ్యాన్' అంటూ ఆయన చెప్పిన డైలాగ్.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పుడాయన ఇక లేరు. లోకం విడిచి వెళ్లిపోయారు.
బ్యాట్‌మెన్ యానిమేటెడ్ సిరీస్‌లో బ్యాట్‌మ్యాన్ క్యారెక్టర్‌కు వాయిస్ ఓవర్ అందించిన కెవిన్ కాన్రాయ్ కన్నుమూశారు. క్యాన్సర్ బాధపడుతున్న ఆయన.. 66 ఏళ్ల వయసులో న్యూయార్క్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు వార్నర్ బ్రదర్స్ సంస్థ ప్రకటించింది. దీంతో ఆయన అభిమానులు, సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
1992-96 మధ్య కాలలో బ్యాట్‌మ్యాన్ యానిమేటెడ్ సిరీస్‌లు విపరీతంగా ఆకట్టుకున్నాయి. అందులో 15 చిత్రాలు, 400 టీవీ ఎపిసోడ్స్, 20కిపైగా వీడియోగేమ్స్, బ్యాట్‌మ్యాన్:ఆర్ఖామ్ అండ్ ఇన్‌జస్టిస్ ఫ్రాంచైజీలకు వాయిస్ ఓవర్ అందించారు కాన్రాయ్. న్యూయార్క్ వెస్ట్‌బ్యూరీలో జన్మించిన కెవిన్ కాన్రాయ్.. థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 1980 నుంచి టీవీ యాడ్స్ ద్వారా నటనలోకి అడుగుపెట్టి.. చాలాకాలం బుల్లితెర ప్రజలను అలరించారు. ఆపై కొన్ని చిత్రాలు, టీవీ సిరీస్‌ల్లోనూ మెరిశారు. 1991లో క్యాస్టింగ్ డైరెక్టర్ ఆండ్రియా రొమానో ద్వారా బ్యాట్‌మ్యాన్ సిరీస్‌కు వాయిస్ ఓవర్ అందించడం ప్రారంభించారు. కామిక్స్‌పై ఏమాత్రం అవగాహన లేని కాన్రాయ్.. బ్రూస్ వేన్(బ్యాట్‌మ్యాన్) పాత్రకు తన గాత్రంతో జీవం పోశారు.
-
Kevin Conroy was an idol to me. I looked up to him growing up. I watched the animated series, watched the animated movies, shorts and played all the Arkham games. I'm glad I was even able to meet him this year. He was an awesome guy. RIP legend. You will be missed Batman 🦇❤ pic.twitter.com/noGLyWVLvn
— Dan 🦇 (@Sandwich_Rock_) November 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kevin Conroy was an idol to me. I looked up to him growing up. I watched the animated series, watched the animated movies, shorts and played all the Arkham games. I'm glad I was even able to meet him this year. He was an awesome guy. RIP legend. You will be missed Batman 🦇❤ pic.twitter.com/noGLyWVLvn
— Dan 🦇 (@Sandwich_Rock_) November 11, 2022Kevin Conroy was an idol to me. I looked up to him growing up. I watched the animated series, watched the animated movies, shorts and played all the Arkham games. I'm glad I was even able to meet him this year. He was an awesome guy. RIP legend. You will be missed Batman 🦇❤ pic.twitter.com/noGLyWVLvn
— Dan 🦇 (@Sandwich_Rock_) November 11, 2022
-
RIP LEGEND @RealKevinConroy 🦇
— DC World Telugu (@DCWorldTelugu) November 11, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Thank you for bringing Batman to life with your Iconic voice 🙏#KevinConroy #Batman pic.twitter.com/dMUgnBteqL
">RIP LEGEND @RealKevinConroy 🦇
— DC World Telugu (@DCWorldTelugu) November 11, 2022
Thank you for bringing Batman to life with your Iconic voice 🙏#KevinConroy #Batman pic.twitter.com/dMUgnBteqLRIP LEGEND @RealKevinConroy 🦇
— DC World Telugu (@DCWorldTelugu) November 11, 2022
Thank you for bringing Batman to life with your Iconic voice 🙏#KevinConroy #Batman pic.twitter.com/dMUgnBteqL
ఇదీ చూడండి: సంక్రాంతి బరిలో బాలయ్య, చిరు.. విడుదల విషయంలో అయోమయం