ETV Bharat / entertainment

సంక్రాంతికి బాలయ్య 'వీరసింహారెడ్డి' జాతర.. చిరు 'వాల్తేరు వీరయ్య'కు పోటీగా - బాలకృష్ణ వీరసింహారెడ్డి

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్​. ఎప్పుడంటే.

Veerasimhareddy released date announced
సంక్రాంతికి బాలయ్య 'వీరసింహారెడ్డి' జాతర.. చిరు 'వాల్తేరు వీరయ్య'కు పోటీగా
author img

By

Published : Dec 3, 2022, 2:48 PM IST

Updated : Dec 3, 2022, 3:12 PM IST

సినీ ప్రేక్షకులు ఆశించినట్టే నందమూరి నటసింహం బాలకృష్ణ సంక్రాంతి బరిలోకి దిగారు. తన ట్రేడ్ మార్క్ ఫ్యాక్షన్ లీడర్​గా ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'ని పండగకు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ఓ స్పెషల్​ పోస్టర్​ను రిలీజ్​ చేస్తూ స్పష్టం చేసింది. ఇందులో బాలయ్య సీరియస్​గా.. జనవరి 12న వస్తున్నా అంటూ కనిపించారు. 'అఖండ'తో ఘన విజయం అందుకున్న తర్వాత బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మరోవైపు ఇప్పటికే వీరిసింహారెడ్డి నుంచి విడుదలైన పోస్టర్స్​, సాంగ్​, టీజర్​ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.

కాగా, ఈ చిత్రాన్ని మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ హీరోయిన్​. వరలక్ష్మి శరత్‌కుమార్‌, దునియా విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సాయిమాధవ్‌ బుర్రా-మాటలు, నవీన్‌ నూలి-కూర్పు, ఎ.ఎస్‌.ప్రకాశ్‌-ప్రొడక్షన్‌ డిజైన్‌,రిషి పంజాబీ- ఛాయాగ్రహణం, తమన్ -సంగీతం అందించారు. ఇకపోతే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి కూడా బరిలోకి దిగనున్నారు. మాస్ అవతారంలో చిరు చేస్తున్న ఈ చిత్రాన్ని బాబీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ డేట్​ క్లారిటీ ఇవ్వలేదు. అయితే 13వ తేదీన ఇది థియేటర్లలో సందడి చేస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. దీంతో సంక్రాంతి సీజన్​లో చిరు, బాలయ్యల పోటికి రంగం సిద్ధమైంది.

ఇదీ చూడండి: 'హిట్'​ ఫ్రాంచైజీలో నటించమని అడివిశేష్​ రిక్వెస్ట్​.. సమంత సూపర్​ రిప్లై!

Last Updated : Dec 3, 2022, 3:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.