ETV Bharat / entertainment

'వీరసింహారెడ్డి' న్యూ ఇయర్​ స్పెషల్​​.. సెట్​లో కూతురితో కలిసి బాలయ్య సందడి.. - గోపీచంద్​ మలినేని డైరెక్టర్ కొత్త మూవీ

నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాకి సంబంధించి ఓ అప్​డేట్​ వచ్చింది. ఈ మూవీ మేకింగ్​ వీడియోను న్యూ ఇయర్​ స్పెషల్​గా చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

Veerasimha Movie Making Video
'వీరసింహారెడ్డి' మేకింగ్ వీడియో​.. సెట్​లో కూతురితో కలిసి బాలయ్య సందడి..
author img

By

Published : Dec 31, 2022, 3:02 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా వస్తుందంటేనే అభిమానులకు అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. ఆయన సినిమాల్లో ఉండే యాక్షన్‌ సన్నివేశాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఉన్న సన్నివేశాల్లోనూ తన నటనతో థియేటర్లో విజిల్స్ వేయిస్తారు బాలకృష్ణ. అలా ఈ సారి ఆయన ఫ్యాక్షన్‌ అండ్​ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా 'వీర సింహారెడ్డి'. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా న్యూ ఇయర్ గిఫ్ట్​గా సినిమా మేకింగ్‌ వీడియోను షేర్‌ చేసింది. సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఎలా చిత్రీకరించారో చూపించింది. బాలయ్య యాక్షన్ .. ఎమోషన్ .. సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన సన్నివేశాల నేపథ్యంలోని బిట్స్​తో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. షూటింగ్​కు చూడటానికి వచ్చిన బాలయ్య కుటుంబ సభ్యులు కూడా ఈ మేకింగ్ వీడియోలో కనిపిస్తున్నారు. మొత్తంగా ఈ మేకింగ్ వీడియో చూస్తే బాలయ్య యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. బాలయ్య మాస్‌ యాక్షన్​కు సరిపోయేలా సీన్స్​ను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.

ఇకపోతే బాలకృష్ణ గతంలో నటించిన సూపర్‌ హిట్‌ సినిమాలు సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడులో లాగానే ఈ వీరసింహారెడ్డిలో కూడా హృదయానికి హత్తుకునే కుటుంబ సన్నివేశాలు ఉండనున్నాయట. వరలక్ష్మి శరత్‌కుమార్‌, బాలకృష్ణకు మధ్య జరిగే సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసి కంటతడి పెట్టించేలా ఉంటాయంటున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ పాత్రతో సినిమాలో కీలక మలుపు చోటుచేసుకుంటుందని అంటున్నారు. ఇక ఇప్పటివరకు చిత్రబృందం ఈ సినిమాలోని మూడు పాటలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.