ETV Bharat / entertainment

Unstoppable: పవన్​ను బాలయ్య అడిగే ప్రశ్నలు ఇవేనటా! - బాలకృష్ణ పవన్​కల్యాణ్​ ప్రశ్నలు లీక్​

బాలయ్య అన్​స్టాపబుల్​ షోకు పవన్​కల్యాణ్​ రాబోతున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. ఈ ఎపిసోడ్​లో​ బాలయ్య.. పవన్​ను అడిగే ప్రశ్నలు ఇవేనంటూ మరో ప్రచారం జరుగుతోంది. ఆ సంగతులు..

Balayya unstoppable pawankalyan
పవన్​ను బాలయ్య అడిగే ప్రశ్నలు ఇవేనటా!
author img

By

Published : Dec 21, 2022, 10:10 AM IST

Updated : Dec 21, 2022, 11:43 AM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా మారి.. తనదైన శైలిలో అలరిస్తూ.. వచ్చిన సెలబ్రిటీలతో సందడి చేస్తున్న షో అన్​స్టాపబుల్. ఆసక్తిరేకెత్తించే ప్రశ్నలు.. వినోదాన్ని అందించే అల్లరితో.. ఈ షో సీజన్ 2 కూడా యమా క్రేజ్​ను దక్కించుకుంది. ఎప్పుడూ కెమెరా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వని బడా స్టార్స్ కూడా బాలయ్య షోకి హాజరై సందడి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు సందడి చేయగా.. ఇప్పుడు పవన్​కల్యాణ్ కూడా రాబోతున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. దీంతో పవన్​-బాలయ్య ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ ఆడియెన్స్​లో బాగా నెలకొంది. వీరిద్దరి మధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ ఉండబోతోంది, పవన్ వ్యక్తిగత జీవితం గురించి బాలయ్య ఏమని ప్రశ్నిస్తారు? అని చాలా అనుమానాలు అభిమానుల్లో మెదులుతోంది. ఇకపోతే ఈ ఎపిసోడ్​కు దర్శకుడు త్రివిక్రమ్ కూడా హాజరు కాబోతున్నట్లు తెలిసింది.

అయితే ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఈ ఎపిసోడ్​ గురించి మరో ఇంట్రెస్టింగ్​ వార్త బయటకు వచ్చింది. బాలయ్య పవన్​ను ఈ ప్రశ్నలు అడగబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. పవన్ రాజకీయ వ్యవహారాలు, సినిమాల విషయంలో త్రివిక్రమ్ ప్రమేయం ఉంటోంది అని బయట చాలా కాలంగా రూమర్ నడుస్తోంది. దాని గురించి బాలయ్య ప్రశ్నించనున్నారట. ఈ మధ్య కాలంలో రీమేక్ చిత్రాలు చేయడానికి గల కారణాన్ని బాలయ్య అడగనున్నారట. అలాగే పవన్​-ఓ నటి మధ్య ఉన్న అనుబంధంపై చాలా కాలంగా ప్రచారంలో ఉన్న గాసిప్ గురించి క్లారిటీ తీసుకోబోతున్నారట.

ఇక ఈ ఎపిసోడ్​లో మరో బిగ్ సర్​ప్రైజ్​ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. షో మధ్యలో బాలకృష్ణ.. మెగాస్టార్ చిరంజీవి మధ్య సరదా ఫోన్ సంభాషణ కూడా ఉండనుందట. పవన్​ను సరదాగా ఆటపట్టించే విషయాలని బాలయ్య చిరంజీవిని అడిగి తెలుసుకోబోతున్నట్లు టాక్. మొత్తంగా ఈ ఎపిసోడ్​ నిజంగా ఉందో లేదో తెలియదు గానీ.. వైరలవుతున్న ఈ ప్రశ్నలు మాత్రం ఆడియెన్స్​లో తెగ ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇదీ చూడండి: కేజీఎఫ్ బ్యూటీ మిలమిలా ఫ్యాన్స్​ హృదయాలు విలవిలా

Last Updated : Dec 21, 2022, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.