ETV Bharat / entertainment

NBK 109: బాలయ్యకు రూ.20కోట్లు.. రూ.10 కోట్లు కావాలంటూ దర్శకుడు డిమాండ్​! - బాలయ్య NBK 109 రెమ్యునరేషన్

బాలకృష్ణ NBK 109 గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. బాలయ్య ఓ కొత్త దర్శకుడితో చేయబోతున్నారని తెలిసింది. అయితే ప్రస్తుతం చర్చల దశలో ఉందట. కానీ ఇక్కడ ఓ చిన్న సమస్య వచ్చిందట. దాని గురించే ఈ కథనం..

Balakrishna NBK 109 with new director Asks 10 crores
NBK 109: బాలయ్యకు రూ.20కోట్లు.. రూ.10 కోట్లు కావాలంటూ దర్శకుడు డిమాండ్​!
author img

By

Published : Feb 15, 2023, 10:31 PM IST

అన్ స్టాపబుల్ షో.. అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్యాక్​ టు బ్యాక్ వరుస భారీ బ్లాక్ బస్టర్​ హిట్లతో నందమూరి నటసింహం బాలకృష్ణ రేంజ్​ పెరిగిపోయింది. అభిమానుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో ఆయన ప్రస్తుతం ఫుల్ జోష్​లో ఉన్నారు. రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు ప్రస్తుతం రూ.20కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం!

అయితే బాలయ్య ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK 108 చేస్తున్న సంగతి తెలిసిందే. ఫాదర్ అండ్ డాటర్​ సెంటిమెంట్​తో రూపొందబోయే ఈ చిత్రంలో బాలయ్య డిఫరెంట్​ లుక్​లో ఉండబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తవ్వకముందే బాలయ్య NBK 109 కథలపై కూడా ఫోకస్ పెట్టారని తెలిసింది. దీని గురించి గత కొద్ది రోజులుగా తెగ వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ దర్శకులతో పాటు యువ దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో పూరీజగన్నాథ్​, క్రిష్​, బోయపాటితో పాటు ప్రశాంత్ వర్మ, వెంకటేశ్ మహా పేర్లు ఉన్నాయి.

అయితే ఇదిలా ఉండగా.. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. బాలయ్య NBK 109ని ఓ కొత్త దర్శకుడితో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. ఆ దర్శకుడు ఇటీవలే తన తొలి సినిమాతో మంచి హిట్​ అందుకున్నారని సమాచారం. అయితే ఈ చర్చల్లో ఓ చిన్న సమస్య వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు బాలయ్య రూ.20కోట్ల పారితోషికం​ తీసుకోనున్నారట. అయితే ఆ దర్శకుడు కూడా తనకు రూ.10కోట్లు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. కానీ ఆ మూవీ నిర్మాత.. కేవలం రూ.2 కోట్లు మాత్రమే ఇస్తానని, నాన్​ థియేట్రికల్​ లాభాల్లో 20 శాతం షేర్​ ఇస్తానని అంటున్నారట. అయితే దీనిపై దర్శకుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. మరి ఈ చర్చలు ఫలిస్తాయో లేదో... అసలు ఆ దర్శకుడు ఎవరో, నిర్మాత ఎవరో తెలియలేదు.

ఇదీ చూడండి: సమంత పక్కా ప్లాన్​.. ఇకపై దానిపైనే ఫోకస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.