Avatar Movie Rerelease: పండార గ్రహం.. అక్కడి అద్భుత ప్రకృతి, విచిత్రమైన జంతువులు, ఉనికి కోసం పోరాడే అక్కడి జీవజాతి.. ఇలా ప్రతీ ఒక్కటీ సినీ ప్రేక్షకులకు పరిచయమే. జేమ్స్ కామరూన్ తెరకెక్కించిన 'అవతార్' 2009లో విడుదలై వీటిని మన కళ్లముందు ఉంచింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా 'అవతార్-2' తీస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 16న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'అవతార్'ను మరోసారి మనకు చూపించడానికి సిద్ధమైంది చిత్రబృందం. సెప్టెంబర్ 23న ఇది థియేటర్లలో విడుదల కానుంది. ఈసారి 4కే హై డైనమిక్ రేంజ్ సౌండ్, విజువల్స్‌తో కనువిందు చేస్తామని చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
-
On September 23 #Avatar returns to the big screen for a limited time only. Watch the new trailer now 💙 pic.twitter.com/9REw4umdGW
— Avatar (@officialavatar) August 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">On September 23 #Avatar returns to the big screen for a limited time only. Watch the new trailer now 💙 pic.twitter.com/9REw4umdGW
— Avatar (@officialavatar) August 23, 2022On September 23 #Avatar returns to the big screen for a limited time only. Watch the new trailer now 💙 pic.twitter.com/9REw4umdGW
— Avatar (@officialavatar) August 23, 2022
మన దేశంలో ఈ సినిమాను 20 సెంచరీ స్టూడియో ఇండియా రీ రిలీజ్ చేస్తోంది. జేమ్స్ కామెరూన్ ఈ చిత్రాన్ని 1994లో రాయడం మొదలు పెట్టగా.. షూటింగ్ పూర్తైనప్పటికీ సుమారు 15 ఏళ్లకు పైగా సమయం పట్టింది. దాదాపు 237 మిలియన్ డాలర్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అప్పట్లోనే మూడు బిలియన్ యూఎస్ డాలర్స్ పైగా వసూలు చేసింది.
ఇవీ చదవండి: ఈ నటుడెవరో గుర్తుపట్టుకోండి చూద్దాం