ETV Bharat / entertainment

చైతూ-శోభిత డేటింగ్​.. నేనలా అనలేదంటూ సమంత షాకింగ్ కామెంట్స్​ - నాగచైతన్య శోభితా రిలేషన్​ షిప్​

నాగచైతన్య-సమంత విడాకుల తర్వాత ఏం చేసినా, ఏం మాట్లాడిన మీడియాలో హాట్​టాపిక్​గా మారుతోంది. అయితే సామ్‌తో డివోర్స్​ తర్వాత.. చైతూ.. హీరోయిన్​ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా ఈ వార్తలపై సమంత స్పందించినట్లు కథనాలు వస్తున్నాయి. ఆ వివరాలు..

Samantha Ruth Prabhu reacts to Naga Chaitanya-Sobhita Dhulipala dating rumours
చైతూ-శోభిత డేటింగ్​.. సమంత అంత మాటనేసిందేంటి!
author img

By

Published : Apr 4, 2023, 12:01 PM IST

Updated : Apr 4, 2023, 12:28 PM IST

టాలీవుడ్​ హీరో హీరోయిన్లు నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్న తర్వాత మీడియాలో చాలా సార్లు హాట్​టాపిక్​గా మారారు. అయితే సినిమాల పరంగా ఎవరీ లైఫ్​లో వారు బిజీగా ఉన్నప్పటికీ పర్సనల్​ విషయాల్లో మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నారు. అయితే ప్రస్తుతం 'శాకుంతలం' సినిమా ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న ​సమంత... తాజా ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. తనతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య.. హీరోయిన్​ శోభిత ధూళిపాళ్ల మధ్య రిలేషన్​ ఉన్నట్లు వస్తున్న పుకార్లపై సామ్​ స్పందించినట్లు కథనాలు వస్తున్నాయి. చైతూ పేరు చెప్పకుండా.. "ఎవరు ఎవరితో రిలేషన్​షిప్​లో ఉన్నారని నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వారికి ఎంత మందితో డేట్ చేసినా, చివరికి మిగిలేది కన్నీరే. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలి. తన ప్రవర్తన మార్చుకుని, అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అది అందరికీ మంచిది" అంటూ తన అభిప్రాయాన్ని చెప్పినట్లు పలు వెబ్​సైట్లు కథనాలు రాస్తున్నాయి. అయితే ఈ మాట విన్న నెటిజన్లు ఒక్కసారిగా షాక్​కు గురౌతున్నారు.

నేనలా అనలేదు.. అయితే ఈ ప్రచారంపై సమంత సోషల్​మీడియా వేదికగా స్పందించింది. తాను అలా అనలేదంటూ చెప్పుకొచ్చింది. అవన్నీ అసత్య ప్రచారాలు అని కొట్టిపారేసింది. ఓ వైబ్​సైట్​ కథనాన్ని ప్రస్తావిస్తూ.. 'నేను ఇలా చెప్పలేదు' అని ట్వీట్ చేసింది. అంతకుముందు ఏప్రిల్​ 4న పాల్గొన్న ఇంటర్వ్యూలో వైవాహిక బంధానికి స్వస్తి పలికిన నాటి రోజులను గుర్తు చేసుకుంది. ఆ రోజులను చీకటి క్షణాలుగా పేర్కొంది. ఆ బాధ నుంచి తానింకా పూర్తిగా కోలుకోలేదని చెప్పింది.

కన్నీళ్లు చూశా.. "స్వతంత్ర భావాలు కలిగిన బలమైన మహిళగా మీరు నన్ను అనుకోవచ్చు. కానీ.. నన్ను నేను అలా భావిచడం లేదు. ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలను చూశా. 'నాకు మంచే జరుగుతుందా?' అంటూ రోజూ మా అమ్మని అడుగుతూ ఉండేదాన్ని. చీకటి రోజులు చూశా. పిచ్చి పిచ్చి ఆలోచనలు తెగ వస్తుండేవి. ఆ ఆలోచనలు నన్ను నాశనం చేయకూడదని బలంగా అనుకున్నా. ముందుకు అడుగు వేశా. ఫ్యామిలీ మెంబర్స్​, ఫ్రెండ్స్​.. నాకు మద్దతుగా ఉన్నారు. వాళ్ల వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. అయితే, ఆ బాధ నుంచి నేనింకా పూర్తిగా బయటకు రాలేదు. ముందుతో పోలిస్తే చీకటి రోజులు తగ్గాయని అనుకుంటున్నాను. కష్టమైన సందర్భాలు ఎదుర్కొన్నప్పుడు మనలో ధైర్యం మరింత పెరుగుతుంది. ఎప్పటికీ చీకటి క్షణాలు అలాగే ఉండిపోవు అని మనం తెలుసుకోవాలి" అని సమంత వివరించింది.

కాగా, సామ్​-నాగచైతన్య పెళ్లైన నాలుగేళ్లకే విడిపోయారు. 2021లో అక్టోబర్ 8న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్​కు గురిచేశారు. అయితే విడిపోవడానికి గల కారణాలను మాత్రం చెప్పలేదు.

Samantha Ruth Prabhu reacts to Naga Chaitanya-Sobhita Dhulipala dating rumours
చైతూ-శోభిత డేటింగ్​.. నేనలా అనలేదంటూ సమంత షాకింగ్ కామెంట్స్​

ఇదీ చూడండి: సమంతపై నిర్మాత షాకింగ్ కామెంట్స్​!.. రష్మికతో డీల్​కు గ్రీన్​సిగ్నల్​!

Last Updated : Apr 4, 2023, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.