ETV Bharat / entertainment

Anni Manchi Sakunamule Review : 'అన్నీ మంచి శకునములే' మూవీ ట్విట్టర్ రివ్యూ - నందిని రెడ్డి సినిమాల లిస్ట్​

Anni Manchi Sakunamule Review : యువ హీరో సంతోశ్​ సోభన్​​, మాళవిక నాయర్​ జంటగా.. నందిని రెడ్డి తెరకెక్కించిన ' అన్నీ మంచి శకునములే' గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీమియర్​ షోల​కు వెళ్లిన ఆడియన్స్​ ట్విట్టర్​ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ వారు ఏమంటున్నారంటే ?

Anni Manchi Sakunamule twitter Review
Anni Manchi Sakunamule twitter Review
author img

By

Published : May 18, 2023, 11:51 AM IST

Updated : May 18, 2023, 12:56 PM IST

Anni Manchi Sakunamule Review : వైజయంతీ మూవీస్​ అనుబంధ సంస్థ స్వప్న సినిమా బ్యానర్​పై నందిని రెడ్డి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్​టైనర్ 'అన్నీ మంచి శకునములే'. యంగ్​ హీరో సంతోశ్ సోభన్​, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో ప్రీమియర్​ షోలు చూసిన అభిమానులు.. ట్విట్టర్​ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే ?

ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకు మిక్స్​డ్​ టాక్​ వినిపిస్తోంది. సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనరే అయినా చాలా బోరింగ్‌గా ఉందని.. కొన్ని డీసెంట్ కామెడీ సీన్లు, ఫీల్ గుడ్ మూమెంట్స్ మినహా మిగిలిన సినిమా అంతా ల్యాగ్​ అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. ట్విస్ట్​లను ప్రేక్షకులు సులభంగా ఊహిస్తారని చెబుతున్నారు. మరికొంత మంది.. ఇది పర్ఫెక్ట్ ఓటీటీ మూవీ అని.. అక్కడక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయంటున్నారు. పెళ్లి సంప్రదాయాల సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారని వివరించారు. నిర్మాణ విలువలు బాగున్నాయని.. సినిమా మొదట్లో, క్లైమాక్స్​ ఆకట్టుకుందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయంటున్నారు. ఇక, సంతోశ్ సోభన్, మాళవిక నాయర్​ పాత్రల్లో ఒదిగిపోయారని చెప్పారు.

  • Very Very good first half

    — Toronto Saab (@saketh9) May 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టాలీవుడ్​లో ఫీల్​ గుడ్​​ సినిమాలకు కేరఫ్​ అడ్రస్​గా నిలిచారు నందిని రెడ్డి. తీసింది కొన్ని సినిమాలే అయినా.. అవి ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఆమె సినీ కెరీర్​ నాచురల్​ స్టార్​ నానీ, నిత్యా మీనన్​ జంటగా నంటించిన 'అలా మొదలైంది'తో ప్రారంభమైంది. మొదటి సినిమాతో సూపర్ హిట్​ అందుకున్నారు. ఈ సినిమాతో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్​గా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత సిద్ధార్థ్​, నిత్యా మీనన్​, సమంత ప్రధాన పాత్రల్లో 'జబర్​దస్త్​'ను తెరకెక్కించారు. ఆ తర్వాత నాగశౌర్య, మళవిక నాయర్​ జంటగా 'కల్యాణ వైభోగమే' సినిమా తీశారు. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా నిలిచింది.

మరో సారి సమంత లీడ్​ రోల్​లో 'ఓ బేబీ' తెరకెక్కించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. తాజాగా మళ్లీ మాళవికతో రెండోసారి 'అన్నీ మంచి శకునములే' సినిమా తీశారు. నందిని రెడ్డి తీసిన ప్రతి సినిమా ఇంటిల్లిపాదీ అందరూ కలిసి చూడొచ్చు. వల్గర్​ కామెడీ, అసభ్యకరమైన సన్నివేశాలు ఈమె సినిమాలో ఉండవు. అన్నీ మంచి శకునములే చిత్రం కూడా క్లీన్​ యూ సర్టిఫికేట్​ పొందింది.

ఈ మూవీ రిలీజ్​కు ముందే మరో సినిమా పట్టాలెక్కించారు నందిని. డీజే టిల్లు సినిమాతో సంచలనం సృష్టించిన సిద్ధు జొన్నల గడ్డతో తన తదుపరి సినిమా చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు వచ్చిన కథల కంటే.. ఈ స్టోరీ పూర్తిగా భిన్నంగా ఉంటుందని.. అందులో పెళ్లి, కుటుంబాలు ఉండవు ( నవ్వుతూ) అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

  • #AnniManchiSakunamule A Family Entertainer that had its moments but falters with the overall execution. Has a few decent comedy scenes/feel good moments but the rest is totally dragged out with a lengthy runtime and snail paced narration in many parts. Mediocre!

    Rating: 2.5/5

    — Venky Reviews (@venkyreviews) May 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : May 18, 2023, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.