ETV Bharat / entertainment

టాలీవుడ్​ హిట్​ కాంబో రిపీట్​.. బన్నీతో మరోసారి మాటల మాంత్రికుడు!​ - అల్లు అర్జున్​ త్రివిక్రమ్ నెక్స్ట్​ సినిమా

Allu Arjun Trivikram Next Movie : టాలీవుడ్​లో మరో హిట్​ కాంబో ప్రేక్షకులను అలరించనుంది. 'పుష్ప' సినిమాతో పాన్​ ఇండియా క్రేజ్​ సంపాందించుకున్న ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్.. తనకు హిట్​ సినిమాలు అందించిన టాలీవుడ్​ ప్రముఖ దర్శకుడితో మరోసారి జట్టు కట్టనున్నాడట. ఆ వివరాలు..

bunny trivikram
bunny trivikram
author img

By

Published : May 7, 2023, 10:19 PM IST

Allu Arjun Trivikram Next Movie : ప్రముఖ టాలీవుడ్​ దర్శకుడు సుకుమార్​ తెరకెక్కించిన 'పుష్ప'తో సినిమా పాన్​ ఇండియా రేంజ్​లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​. ఈ హింట్​ కాంబో నుంచి 'పుష్ప-2' త్వరలో విడుదల కానుంది. పుష్ప తర్వాత వరుస సినిమాలకు ఓకే చెబుతున్నారు అల్లు అర్జున్. పాన్​ ఇండియా ఆడియెన్స్​ను దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రజెక్టులకు గ్రీన్ సిగ్నల్​ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ నుంచి రాబోయే తదుపరి అనౌన్స్​మెంట్​పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..

టాలీవుడ్​ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో 'జులాయి', 'సన్​ ఆఫ్​ సత్యమూర్తి', 'అలవైకుంఠపురంలో' లాంటి సూపర్​ హిట్​లు చిత్రాల్లో నటించారు బన్నీ. ఇప్పుడు ఈ హిట్​ కాంబినేషన్​ మరోసారి రిపీట్​ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సోషల్​ మీడియాలో టాక్​ నడుస్తోంది. ఇక, ఈ సినిమాలో అల్లు అర్జున్​ సరసన.. మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ హీరోయిన్​గా నటించే అవకాశం ఉందట. అయితే, ఆ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

బన్నీ, త్రివిక్రమ్​ శ్రీనివాస్​ కాంబినేషలో వచ్చిన సినిమాలు ఓ రేంజ్​లో హిట్​ అందుకున్నాయి. ఇప్పుడు బన్నీ మరోసారి త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో నటిస్తే.. అల్లు వారి అబ్బాయి క్రేజ్​ మరో లెవల్​కు వెళ్లే అవకాశం ఉంది. దీంతో పాటు త్రివిక్రమ్​కు కూడా పాన్​ ఇండియా స్థాయిలో తన మాటలతో మాయ చేయడానికి అవకాశం లభిస్తుంది.
తెలుగులో 'అర్జున్ రెడ్డి', హిందీలో 'కబీర్ సింగ్' సినిమాలతో వరుసగా భారీ హిట్లను అందుకుని సన్షేషన్ క్రియేట్​ చేసిన డైరెక్టర్​ సందీప్ రెడ్డి వంగా. 'పుష్ప-2' తర్వాత సందీప్ రెడ్డి, అల్లు అర్జున్​ సినిమా పట్టాలెక్కనుంది. ఈ ప్రాజెక్ట్​ను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలపై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించనున్నారు.

బన్నీ బాలీవుడ్​ ఎంట్రీ!
అల్లు అర్జున్​ బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త అప్పట్లో సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీనికి ఇటీవల మళ్లీ ఈ వార్త సమాజిక మాధ్యమాల్లో వైరల్​ అయింది. దీంతో అది నిజమే అనే వార్తలు వచ్చాయి. బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ నటిస్తున్న జవాన్​ సినిమాలో బన్నీ రోల్​ ఉందన్న విషయం గట్టిగానే వినిపిస్తోంది. అప్పట్లో చెప్పినట్లే ఈ సినిమాలో అల్లు అర్జున్​ గెస్ట్​ రోల్​లో మెరవనున్నారట. అంతే కాకుండా ఈ సినిమాలో బన్నీ షెడ్యూల్​ కూడా కంప్లీట్​ అయ్యిందని టాక్​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.