ETV Bharat / entertainment

అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్.. హైదరాబాద్​లో తొలిసారి ఆ టెక్నాలజీతో.. - అల్లు అర్జున్​ మల్టీప్లెక్స్​ ఓపెనింగ్​ డేట్​

సినిమాలతో బిజీగా ఉండే ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ ఇప్పుడు బిజినెస్​ రంగంలోకి అడుగుపెట్టారు. తన పేరుతో హైదరబాద్​లో ఓ మల్టీప్లెక్స్​ నిర్మాణాన్ని చేపట్టారు. త్వరలో ఓపెన్​ అవ్వనున్న ఈ థియేటర్​కు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే..

allu arjun multiplex
allu arjun multiplex
author img

By

Published : Mar 8, 2023, 7:10 AM IST

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ అటు సినిమాలతో పాటు ఇటు యాడ్​ షూట్లతో బిజీ బిజీగా ఉంటారు. ఆయన రీసెంట్​ సినిమా పుష్ప.. బాక్సాఫీస్​ను ఓ రేంజ్​లో షేక్​ చేసింది. అల్లు అర్జున్​ రేంజ్​ పాన్​ ఇండియా లెవెల్​ నుంచి పాన్​ వరల్డ్​ లెవెల్​కు చేరుకుంది. దీంతో ఈయనకు యువతలో మరింత క్రేజ్​ పెరిగింది. ఆయన ఏం చేసినా సెన్సేషన్​ అంటూ అభిమానులు ఆయన్ను ఆకాశానికి ఎత్తుతున్నారు.

ఈ క్రమంలో ఈ పాన్​ ఇండియా స్టార్​ ఇప్పుడు బిజినెస్​ రంగంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్​లోని అమీర్​ పేట్​లో తన పేరుతో ఓ భారీ మల్టీప్లెక్స్​ను నిర్మించే పనుల్లో నిమగ్నమైపోయారు. ఏషియన్ సినిమాస్​తో కలిసి ఈ మల్టీప్లెక్స్​ను ఏర్పాటు చేస్తున్నారు అల్లు అర్జున్. అత్యాధునిక టెక్నాలజీతో పాటు అన్నీ సౌకర్యాలు ఉండే ఈ ఏషియన్‌ మల్టీప్లెక్స్​లో త్వరలో ప్రేక్షకులను అలరించనుంది. ఇప్పటికే నిర్మాణ పనులు చివరి దశకు చేరుకునందున్న దీన్ని త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది అల్లు టీం.

ఈ థియేటర్​ ద్వారా ఫుల్ ఎల్‌ఈడీ ప్రొజెక్షన్‌ స్క్రీన్‌ సౌకర్యాన్ని అందించనున్నారట. దీంతో సౌత్​లోనే ఫుల్ ఎల్‌ఈడీ ప్రొజెక్షన్‌ స్క్రీన్‌ సౌకర్యమున్న రెండో థియేటర్‌గా ఈ ఏఏఏ (ఏషియన్ అల్లు అర్జున్) మల్టీప్లెక్స్ రికార్డుకెక్కనుంది. అంతే కాకుండా హైదరాబాద్‌లో ఇలాంటి సౌకర్యాలు ఉన్న మొదటి థియేటర్‌ ఇదే కావడం మరో విశేషం. దీంతో బన్నీ రేంజ్​ ఇంకాస్త పెరగనుంది. ఇప్పటికే తన సినిమాలతో అభిమానుల మసనులు దోచుకున్న ఈ పుష్ప స్టార్​ త్వరలో తన థియేటర్​తోనూ మంచి ఆదరణ పొందుతారని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సుకుమార్​ దర్శకత్వంలో అల్లు అర్జున్​, రష్మిక మందన్న నటించిన పుష్ప చిత్రానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. నార్త్​లో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సినిమాలోని పాటలు, డ్యాన్స్​లు, డైలాగ్స్​లను సెలబ్రిటీలు సైతం అనుకరించారు. దీంతో అల్లు అర్జున్​కు ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్​ ఏర్పడింది. ఇక ఈ సినిమాతో ఐకాన్​ స్టార్​ కాస్తా పాన్​ వరల్డ్​ స్టార్​ అయిపోయారు. వివిధ దేశాల అభిమానులంతా ఈ స్టార్​ హీరో నటనకు ఫిదా అయిపోయి.. 'తగ్గేదే లే' అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక ఈ సినిమా సక్సెస్​ టూర్​ సంబరాలు కూడా అంబరాన్ని అంటేలా జరిగాయి. కాగా ఇప్పడు ఈ సినిమాకు సీక్వెల్​ తీసే పనిలో నిమగ్నమయ్యారు దర్శకుడు సుకుమార్​. బన్నీ కూడా సీక్వెల్​ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్ప ది రూల్​గా తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్​ షూటింగ్​లో బిజీ అయిపోయారు అల్లు అర్జున్​.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.