ETV Bharat / entertainment

మహేశ్​ సినిమాలో అల్లు అర్హ కనిపించనుందా? - మహేశ్ త్రివిక్రమ్​ మూవీలో అల్లుఅర్హ

సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించబోయే సినిమాలో అల్లుఅర్జున్​ కూతురు అల్లు అర్హ కనిపించనుందని ప్రచారం సాగుతోంది. ఆ సంగతులు..

Allu Arha in Mahesh Trivikram movie
మహేశ్​ సినిమాలో అల్లు అర్హ కనిపించనుందా?
author img

By

Published : Jan 3, 2023, 10:14 PM IST

గతేడాది సర్కారు వారి పాటతో సూపర్​ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్​తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్​ చేయనున్నాడు. అయితే తాజాగా మహేశ్​-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్​గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ పాత్ర కోసం అల్లు అర్జున్ కూతురు నటించనుందట. తాజా సినీవర్గాల సమాచారం ప్రకారం.. సినిమాలో ఓ కీలకపాత్రలో అల్లు అర్జున్ కూతురు అర్హ కనిపించనుందని టాక్. అర్హ ఇప్పటికే సమంత శాకుంతలం మూవీలో నటించింది. పైగా సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే అర్హను తీసుకునేందుకు మూవీటీమ్​ ఆలోచిస్తుందట. మరి ఇందులో నిజమెంతో తెలియదు గానీ ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

ఇకపోతే ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్‌ పనులను జరుపుకుంటోంది. అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. #SSMB28గా ఇది ప్రచారంలో ఉంది. పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుందని సమాచారం. ఇందులో మహేశ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించనున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి: పాపం పునర్నవి ఆ సమస్యతో ఎంత బాధపడుతుందో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.