Akashpuri Alitho Saradaga: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడిగా తెరంగేట్రం చేసినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు ఆకాశ్ పూరి. పలు సూపర్‌హిట్ చిత్రాల్లో బాల నటుడిగా మెరిసిన ఆయన 'ఆంధ్రాపోరి' సినిమాతో హీరోగా మారాడు. ప్రస్తుతం 'చోర్ బజార్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆకాశ్ 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి.. వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు పంచుకున్నాడు. ఆ విశేషాలివీ..
హరీశ్‌శంకర్ బాగా తిట్టారు.. 'గబ్బర్‌సింగ్'లో పవన్‌కల్యాణ్ చిన్నప్పుడి క్యారెక్టర్ చేశా. అప్పుడు ట్రాక్టర్ మీద ఎక్కి ఓ డైలాగ్ చాలా గట్టిగా, ఎమోషన్‌గా చెప్పాలి. కానీ నేనేమో చిన్నగా చెప్పా. అలా మళ్లీ మళ్లీ చిన్నగానే చెప్పా. వెంటనే హరీశ్‌శంకర్ లేచి కుర్చీని తన్ని 'సరిగ్గా రాదా' అని తిట్టారు. అప్పుడు ఎమోషన్ వచ్చింది. అప్పుడు అర్థమైంది.. ఎమోషన్‌గా డైలాగ్ ఎలా చెప్పాలి. ఆయన నుంచే నేర్చుకున్నా. ఆయనకు థ్యాంక్స్. పవన్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.
జిమ్‌లో క్లీనింగ్‌కు వెళ్లా.. పదో తరగతి చదవడం మానేశా. సినిమాల్లోకి వెళ్తాను నాన్న అని చెప్పా. టెన్త్‌కే ఎంబీబీఎస్ చేసినట్టు ఫీలయ్యా. డాడీ నన్ను లైన్లో పెట్టాలనుకున్నారు. పార్ట్‌టైమ్ జాబ్‌లో పెడతానన్నారు. అలానే జిమ్‌కు మేనేజర్‌తో కలిసి వెళ్లా. అక్కడి వాళ్లకు నన్ను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కానీ గుర్తుపట్టలేకపోతున్నారు. ఉద్యోగం ఎందుకు అంటే.. ఆర్థిక సమస్యలు అని చెప్పా. అవన్నీ క్లీన్ చేయాలి అంటూ నేను చేయాల్సిన పనులు, అక్కడి రూల్స్ చెప్పారు. ఈలోగా నాకొక ఫోన్ వచ్చింది. నాది ఐఫోన్. అది చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది. నువ్వు పూరీ జగన్నాథ్ కొడుకువా అని అడిగారు. కాదన్నా. కానీ.. పక్కన ఓ వ్యక్తి వచ్చి అవునని చెప్పాడు. నన్ను ఆ ఉద్యోగంలో చేర్చుకోలేదు. నాన్నకు చెప్పా. రెండు రోజుల్లో ఇంకోటి చూస్తా అని చెప్పారు. నేనింతే సినిమాకు ఒక రోజంతా ప్రొడక్షన్ బాయ్‌గా చేయించారు. కాఫీలు, టీలు అందించా. ఇంతపెద్ద డైరక్టర్ కొడుకుని ఇలా ఎందుకు చేస్తున్నా అని నాకు ఎప్పుడూ అనిపించలేదు.
నాన్నను లాఠీతో కొట్టి వెళ్లిపోమన్నారు.. అర్చన గారితో నటించడం చాలా అదృష్టంగా భవిస్తున్నాను. నాన్న ఓ జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు. ఆమెను డబ్బింగ్ చెప్పడం కోసం ఓ స్డూటియోకి వస్తే.. తనను చూసేందుకు నాన్న గోడపై నుంచి ఎగిరి ఎగిరి చూశారంట. అప్పుడు ఓ సెక్యూరిటీ లాఠీతో కొట్టి వెళ్లిపోమన్నారట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జేబులో పెట్టుకుని వెళ్లిపోయా.. అప్పటికే లయన్ కింగ్ సీడీలు ఓ పది కొనిపించాను. అందులో కొన్ని విరిగిపోయాయి. అరిగిపోయాయి. మళ్లీ కావాలని అడిగా. కొనిపించలేదు. సైలెంట్‌గా ప్యాంట్లో పెట్టుకుని వచ్చేశా. కానీ దొరికిపోయా. ఇక దబిడి దిబిడే(నవ్వుతూ).
అయిపోయాం అనుకున్నా.. స్విమ్మింగ్ ఫూల్ ఉన్న నేను పవిత్రతో (చెల్లి) బీచ్‌లో ఆడుకుంటున్నా. ఒక్కసారిగా పెద్ద అల వచ్చి తనను లాక్కువెళ్లింది. వెంటనే నేను దూకి తనను తీసుకొచ్చా. నేను స్విమ్మర్. ఛాంపియన్ కూడా. తనపని అయిపోయింది అనుకున్నా. కానీ లక్కీగా బయటకు తెచ్చా. ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయిపోయా. అప్పుడే తెలిసింది తను అంటే నాకు చాలా బాగా ఇష్టమని.
రాజమౌళి, త్రివిక్రమ్, వివి వినాయక్ సినిమాలు బాగా ఇంపాక్ట్ చేశాయని, వాళ్ల సినిమాలు చూస్తూ పెరిగానని తెలిపాడు ఆకాశ్. 'ధోనీ' సినిమాకుగానూ తొలిసారి పారితోషకం అందుకున్నానట్లు చెప్పాడు. నటుడు రామ్‌చరణ్ తనకు పలు రకాలుగా హెయిర్ స్టైల్ చేశారని నాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. హీరోల్లో ప్రభాస్ తనకు బాగా క్లోజ్ అని తెలిపాడు.
ఇదీ చూడండి: ఆ ప్రొడ్యూసర్ బెదిరించాడు.. తేడా వస్తే నేను మసి: హీరోయిన్ ఆవేదన