ETV Bharat / entertainment

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా.. కపూర్​ ఫ్యామిలీ ఫుల్​ హ్యాపీ - ఆలియా భట్​ గర్భంతో ఉన్న ఫొటోలు

Alia Bhatt Baby: బాలీవుడ్‌ సెలబ్రిటీ జోడీ ఆలియాభట్, రణ్‌బీర్‌ కపూర్‌ తల్లిదండ్రులయ్యారు. ఆదివారం ఆలియా భట్​ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Alia Bhatt Ranbir Kapoor
ఆలియా భట్​ రణబీర్
author img

By

Published : Nov 6, 2022, 12:33 PM IST

Updated : Nov 6, 2022, 2:47 PM IST

Alia Bhatt Baby: బాలీవుడ్‌ సెలబ్రిటీ జోడీ ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌ తల్లిదండ్రులయ్యారు. ముంబయిలోని హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం పండంటి ఆడబిడ్డకు ఆలియా జన్మనిచ్చారని కుటుంబసభ్యులు తెలిపారు. తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని చెప్పారు. ఈ శుభవార్తతో కపూర్‌ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఆలియాను చూసేందుకు కపూర్‌ కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. ఆలియా తాను ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. మరోవైపు ఈ జంటకు అభినందనలు తెలుపుతూ పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆలియా
ఆలియా పోస్ట్​

రణ్​బీర్​ కపూర్, ఆలియా జంట 2022 ఏప్రిల్ 14న ముంబయిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అనంతరం ఆలియా గర్భం దాల్చింది. ఈ క్రమంలోనే సమయం దగ్గర పడుతుండటం వల్ల ఈ జంట పరీక్షల నిమిత్తం ముంబయిలోని ఆస్పత్రికి వచ్చారు. ఈ జంట ప్రెగ్నెన్సీ విషయం వెల్లడించినప్పటి నుంచి ఈ శుభవార్త కోసం అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన 'బ్రహ్మాస్త్ర' సినిమాలో ఈ జంట ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రజల నుంచి విశేష స్పదన లభించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ​లో ప్రసారమవుతోంది. మరోవైపు.. ఆలియా దర్శకుడు కరణ్ జోహార్ దర్శకత్వంలో రాబోతున్న 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ'లో రణవీర్ సింగ్, ధర్మేంద్ర, జయా బచ్చన్‌తో కలిసి నటించనున్నారని సమాచారం.

ఇదీ చదవండి: చూపుతిప్పుకోనివ్వని అందంతో మెస్మరైజ్ చేస్తున్న బుల్లితెర రాములమ్మ

అరుదైన వ్యాధితో బాధపడుతున్న​ స్టార్​ హీరో.. బాడీ బ్యాలెన్స్​ తప్పిపోతుందంటూ ఆవేదన

Last Updated : Nov 6, 2022, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.