ETV Bharat / entertainment

ఆ సీట్​లో హనుమాన్ విగ్రహం!.. రిలీజ్​కు ముందే 'ఆదిపురుష్‌' రికార్డు.. RRR తర్వాత ఇదే - ఆదిపురుష్​ రికార్డులు

Adipurush Movie Record : రామాయణం ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం.. 'ఆదిపురుష్‌'. ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమా.. రిలీజ్​కు ముందే కొత్త రికార్డు నెలకొల్పింది. అదేంటంటే?

adipurush
adipurush
author img

By

Published : Jun 15, 2023, 10:20 PM IST

Adipurush Movie Record : రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్‌ సినిమా విడుదలకు ముందే రికార్డు నెలకొల్పింది. ఆన్‌లైన్‌.. సినిమా టికెట్‌ బుకింగ్‌ పోర్టల్‌ బుక్‌ మై షో వేదికగా 10లక్షలమంది ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. సదరు యాప్‌ వేదికగా 1.75 మిలియన్‌ ఇంట్రెస్టులతో ఆర్‌ఆర్‌ఆర్ మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు 1 మిలియన్‌ లైక్స్‌తో ఆదిపురుష్‌ రెండో స్థానంలో నిలిచింది. బాహుబలి 2 తర్వాత అత్యధికంగా ఇంట్రెస్ట్‌లు పొందిన ప్రభాస్‌ సినిమా ఇదే.

ప్రభాస్ ఫస్ట్ టైమ్ అలా!
Prabhas Adipurush : ప్రభాస్.. 'బాహుబలి' మూవీతో వేరే ఏ హీరో కూడా అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. తనకంటూ సెపరేట్ బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అంతకు ముందు కేవలం తెలుగులోనే మూవీస్ చేస్తూ వచ్చిన ప‍్రభాస్.. చాలావరకు కమర్షియల్ ఎంటర్ టైనర్స్, యాక్షన్ సినిమాలు చేశారు. 'బాహుబలి' లాంటి పీరియాడికల్ మూవీలో నటించి సరికొత్త ట్రెండ్ సృష్టించాడు. పాన్ ఇండియా హీరో అయిపోయాడు 'బాహుబలి' తర్వాత డిఫరెంట్ జానర్స్​లో సినిమాలు చేస్తున్న ప్రభాస్.. 'ఆదిపురుష్'తో మైథలాజికల్ జానర్​లో తొలిసారి నటించారు. డార్లింగ్ హీరో తన కెరీర్​లో ఈ జానర్​లో చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం డైరెక్టర్స్.. మైథలాజికల్ స్టోరీలతో ప్రభాస్​ను అప్రోచ్ అయ్యే ఛాన్స్ గట్టిగానే ఉంటుంది.

ఖాళీ సీటులో హనుమాన్ విగ్రహం, పూజలు..
Hanuman Seat : ఆదిపురుష్ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ఒక సీటును హనుమాన్ కోసం కేటాయించాలని దర్శకుడు ఓమ్ రౌత్ కోరిన తర్వాత ఈ సినిమాపై బజ్ బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే టికెట్​ల విక్రయాల జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు హనుమాన్ కోసం ఉంచిన సీటు గురించి మరో వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే.. కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు హనుమాన్ కోసం కేటాయించిన సీటును అలా ఖాళీగా వదిలేయకుండా ఆ సీటులో హనుమంతుని ఫోటో లేదా విగ్రహంను ఉంచాలని భావిస్తున్నాయట. అంతే కాదు సినిమా ప్రదర్శిత మవుతున్న ప్రతి రోజూ హనుమంతునికి పువ్వులు సమర్పించి హనుమాన్​ను పూజించాలని అనుకుంటున్నాయిట.

  • This is how a seat is being kept aside for Lord Hanuman in theatres playing #Adipurush from tomorrow. A garlanded photo of Hanuman ji.

    These pix are from a theatre in Baroda! pic.twitter.com/LhIIDsBZz3

    — idlebrain.com (@idlebraindotcom) June 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆమిర్​ ఖాన్​ పోస్ట్​
Adipurush Aamir Khan : అయితే ఆదిపురుష్​ సినిమా సూపర్‌ హిట్‌ కావాలంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు, ట్వీట్లు పెడుతున్నారు. ఈక్రమంలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ ఆదిపురుష్‌ యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. నిర్మాత భూషణ్‌ కుమార్, హీరో ప్రభాస్‌, సైఫ్‌ అలీఖాన్‌, ఓం రౌత్​కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఆదిపురుష్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆమిర్‌ పేర్కొన్నారు.

రామాయణాన్ని ఆధారంగా చేసుకుని అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి దర్శకుడు ఓం రౌత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రభాస్‌ రాఘవుడిగా, హీరోయిన్‌ కృతిసనన్‌ జానకిగా, లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. శుక్రవారం విడుదలకానున్న ఈ సినిమా టికెట్లు అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో క్షణాల్లోనే అత్యధికంగా విక్రయం జరిగాయి. దిల్లీలోని కొన్ని మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ ధరలు రూ. 1500 నుంచి రూ. 2200 వరకు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టికెట్‌ ధరలు పెంచిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఆరు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం 4 గంటలకు ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో ఆరు స్క్రీన్స్‌లోనూ బెనిఫిట్‌ షోలు వేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.