ETV Bharat / entertainment

రాముడి రాకకోసం సీతమ్మ తల్లి ఎదురుచూపు.. 'ఆదిపురుష్'​ న్యూ పోస్టర్​ రిలీజ్​! - ఆదిపురుష్​ పోస్టర్​ అప్డేట్​

పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్​' నుంచి ఓ కొత్త అప్డేట్​ను ఇచ్చింది మూవీ టీమ్. సీతా దేవికి సంబంధించిన ఓ న్యూ పోస్టర్​ను శనివారం రిలీజ్​ చేసింది.​ దీంతో ప్రభాస్ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

kriti sanon adipurush poster
kriti-sanon-poster from-adipurush
author img

By

Published : Apr 29, 2023, 10:07 AM IST

Updated : Apr 29, 2023, 10:38 AM IST

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ రాముడి పాత్రలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్‌ 'ఆదిపురుష్‌'. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో బాలీవుడ్‌ నటి కృతిసనన్‌ నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్లను వేగవంతం చేసిన మూవీ టీమ్​ శనివారం ఓ కొత్త పోస్టర్లతో పాటు ఓ మోషన్‌ పోస్టర్​ను విడుదల చేసింది. సీతానవమి సందర్భంగా ఈ పోస్టర్​ను రిలీజ్​ చేసిన మూవీ టీమ్..​ "అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియనామం" అనే క్యాప్షన్​తో షేర్​ చేసింది.

  • अमर है नाम, जय सिया राम।🙏

    The eternal chant, Jai Siya Ram.🙏

    అమరం, అఖిలం
    ఈ నామం,
    సీతారాముల ప్రియనామం🙏

    அழியா நின் நாமம்
    ஜெய் சீதாராம்🙏

    ಅಮರ ನಿಮ್ಮ ನಾಮ
    ಜೈ ಸೀತಾ ರಾಮ🙏

    എന്നേക്കും ശാശ്വതമാണ്
    ജയ് സീതാ റാം🙏

    Jai Siya Ram
    जय सिया राम
    జై సీతారాం
    ஜெய் சீதா ராம்
    ಜೈ ಸೀತಾ ರಾಮ್ pic.twitter.com/sFkBzF2fuJ

    — Om Raut (@omraut) April 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఓ పోస్టర్​లో లంకలో ఉన్న సీతమ్మ.. రాముడి రాక కోసం కన్నీళ్లతో ఎదురుచూస్తున్నట్లు కనిపించారు. మరో పోస్టర్​లో సీతమ్మ తల్లి వెనుక రామునిగా ప్రభాస్​ నిల్చుని ఉన్నారు. ఇక ఇదే పోస్టర్​లో లక్ష్మణుడితో కలిసి శ్రీరాముడు లంకకు పయనమైనట్లు కనిపించారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్లు ఇప్పుడు సోషల్​ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అంతక ముందు రిలీజైన ఫస్ట్​ సింగిల్​తో పాటు ప్రభాస్​ మోషన్​ పోస్టర్​కు​ కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

టీ-సిరీస్‌ పతాకంపై భూషణ్ కుమార్​ నిర్మిస్తున్న ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించగా.. హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. ఇక లంకేశుని పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్​ అలీ ఖాన్​ నటించారు. పాన్​ ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 16న విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లను ప్రారంభించిన మూవీ టీమ్​.. కొత్త పోస్టర్లు, లిరికల్‌ సాంగ్స్‌ను ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

  • अमर है नाम, जय सिया राम।🙏

    The eternal chant, Jai Siya Ram.🙏

    అమరం, అఖిలం
    ఈ నామం,
    సీతారాముల ప్రియనామం🙏

    அழியா நின் நாமம்
    ஜெய் சீதாராம்🙏

    ಅಮರ ನಿಮ್ಮ ನಾಮ
    ಜೈ ಸೀತಾ ರಾಮ🙏

    എന്നേക്കും ശാശ്വതമാണ്
    ജയ് സീതാ റാം🙏

    Jai Siya Ram
    जय सिया राम
    జై సీతారాం
    ஜெய் சீதா ராம்
    ಜೈ ಸೀತಾ ರಾಮ್ pic.twitter.com/LHTiS4xVvp

అయితే ఈ సినిమాకు ఆది నుంచి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. త్వరగానే రిలీజవ్వాల్సిన సినిమా వీఎఫ్‌ఎక్స్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది రిలీజైన టీజర్​కు అభిమానుల్లో మిశ్రమ స్పందన రావడం వల్ల మూవీ టీమ్​ గ్రాఫిక్స్​ను మెరుగుపరిచింది. ఈ క్రమంలో ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్లు చాలా బాగున్నాయని అభిమానులు అంటున్నారు.

కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మే 3న లేకుంటే మే 17న సినిమా ట్రైలర్​ను రిలీజ్‌ చేసేందుకు మూవీ టీమ్​ సన్నాహాలు చేస్తోందని టాక్​. అంతే కాకుండా ఈ ట్రైలర్​ నిడివి 3 నిమిషాల 22 సెకండ్లుగా ఉండనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై మూవీ టీమ్​ ఎటువంటి అఫీషియల్​ అప్డేట్​ ఇవ్వలేదు.

Last Updated : Apr 29, 2023, 10:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.