Adipurush Day 2 Collection : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఓపెనింగ్స్‌లో అదరగొట్టిన ఈ సినిమా.. రెండు రోజు కూడా కలెక్షన్ల పరంగా జోరు కొనసాగిస్తోంది. సోషల్ మీడియాలో నెగిటివిటీ ఉన్నప్పటికీ.. ఆదిపురుష్ సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఓపెనింగ్స్‌లో దాదాపు 140 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. ఇప్పుడు రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంది. రెండు రోజులకు గాను రూ.240 కోట్లు వసూలు చేసినట్లు చిత్రబృందం తెలిపింది.
-
Adipurush continues to mesmerise audiences worldwide, surpassing expectations with a bumper opening of ₹140 CR on Day 1, it adds ₹100 CR on Day 2, taking the total collection to a phenomenal ₹240 CR in just two days! Jai Shri Ram 🙏https://t.co/0gHImE23yj#Prabhas @omraut… pic.twitter.com/EOCb2GroSQ
— T-Series (@TSeries) June 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Adipurush continues to mesmerise audiences worldwide, surpassing expectations with a bumper opening of ₹140 CR on Day 1, it adds ₹100 CR on Day 2, taking the total collection to a phenomenal ₹240 CR in just two days! Jai Shri Ram 🙏https://t.co/0gHImE23yj#Prabhas @omraut… pic.twitter.com/EOCb2GroSQ
— T-Series (@TSeries) June 18, 2023Adipurush continues to mesmerise audiences worldwide, surpassing expectations with a bumper opening of ₹140 CR on Day 1, it adds ₹100 CR on Day 2, taking the total collection to a phenomenal ₹240 CR in just two days! Jai Shri Ram 🙏https://t.co/0gHImE23yj#Prabhas @omraut… pic.twitter.com/EOCb2GroSQ
— T-Series (@TSeries) June 18, 2023
అయితే ఈ సినిమాలోని కొన్ని డైలాగులు కొందరి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ఆ సినిమా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ శుక్లా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇటీవలే ఈ విషయంపై వివరణ ఇచ్చినా.. ఆయనపై విమర్శలు ఆగకపోవడంతో తాజాగా మరో ట్వీట్ పెట్టారు. కొన్ని సంభాషణలు మారుస్తున్నట్లు ప్రకటించారు.
Adipurush Controversy : మరోవైపు, ఈ సినిమాలో గ్రాఫిక్స్‌తో పాటు పాత్రలను చూపించిన విధానం సరిగా లేదని ప్రేక్షకులు మండిపడుతున్నారు. దీంతో ఈ సినిమాపై హిందూసేన దిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. కొంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో డైలాగ్స్ గురించి కూడా తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. దేవుళ్ల చేత అటువంటి డైలాగ్స్ చెప్పిస్తారా అంటూ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. అయితే మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ మాత్రం.. 'మేం రామాయణం తీయలేదు, రామాయణం నుంచి స్ఫూర్తి పొంది ఈ సినిమాను తీశాం' అంటూ పేర్కొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Adipurush Movie : ఇక సినిమా విషయానికి వస్తే.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు ఔం రౌత్ మూడవ సినిమాగా రూపొందిన ఈ 'ఆదిపురుష్'లో రాఘవుడు, జానకిగా ప్రభాస్,కృతిసనన్ కనిపించగా.. లక్ష్మణ హనుమంతుని పాత్రల్లో సన్నీ సింగ్, దేవ్దత్త నాగే మెరిశారు. ఇక లంకేశునిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించగా..శూర్పణఖగా మరాఠీ స్టార్ తేజస్వీ పండిత్ నటించారు. దాదాపు 10 వేల స్క్రీన్లలో ఈ సినిమా జూన్ 16న రిలీజైంది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ సినిమా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందింది. టి-సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">