ETV Bharat / entertainment

పాకిస్థాన్​లో అడివిశేష్​ 'మేజర్​' రికార్డు.. ఆ జాబితాలో అగ్రస్థానం

author img

By

Published : Jul 8, 2022, 12:29 PM IST

Major movie record: యువ హీరో అడివిశేష్​ నటించిన 'మేజర్'​ సినిమా ఇటీవలే విడుదలై ప్రశంసలను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్​ ముందు మంచి వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడీ చిత్రం పాకిస్థాన్​లో ఓ రికార్డు సృష్టించింది. అదేంటంటే..

Adavisesh Major OTT record in Pakisthan
పాకిస్థాన్​లో అడివిశేష్​ 'మేజర్​' రికార్డు

Major OTT Record: వార్‌.. ఎటాక్‌.. యాక్షన్‌.. రొమాన్స్‌... ఫ్యామిలీ... ఇలా అన్ని ఎమోషన్స్‌ను చూపిస్తూ.. అడివి శేష్‌ హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం 'మేజర్​'. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా రూపొందింది. శశి కిరణ్‌ తిక్కా దర్శకుడు. ఫీల్​గుడ్​ ఎమోషనల్​ ఎంటర్​టైనర్​గా సూపర్​హిట్​ టాక్​ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్​ ప్లాట్​ఫామ్​లోనూ అదరగొడుతోంది.

ఓటీటీలో జులై 3న రిలీజ్​ అయిన ఈ మూవీ ఇండియాలో నెట్​ఫ్లిక్స్​ ట్రెండింగ్​ టాప్​ 1,2 స్థానాల్లో కొనసాగుతోంది. అయితే ఈ మూవీ ఇండియాలోనే కాకుండా పాకిస్థాన్​,బంగ్లాందేశ్​, శ్రీలంకలోనూ చరిత్ర సృష్టిస్తోంది. అక్కడ కూడా నెట్​ఫ్లిక్స్​లో అత్యధికంగా వీక్షించిన సినిమాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని హీరో అడివి శేష్​ సోషల్​మీడియా ట్వీట్​ చేశారు. కాగా, ఈ చిత్రాన్ని మహేశ్​బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీలో శోభిత ధూళిపాళ, సయీ మంజ్రేకర్‌, ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇదీ చూడండి: మరో పీరియాడిక్​ సినిమాలో రామ్​చరణ్​.. ఆ యోధుడి పాత్రలో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.