ETV Bharat / entertainment

ఆ పాత్ర కోసం 14 కేజీలు పెరిగిన స్టార్ హీరో - కార్తీక్ ఆర్యన ఫ్రెడ్డీ మూవీ

స్లిమ్​గా స్టైలిష్​గా ఉండే బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ ఓ సినిమాలో తన పాత్ర కోసం ఏకంగా 14 కిలోల బరువు పెరిగాడట. మరి ఆ సినిమా విశేషాలేంటో చూద్దాం..

Karthik Aaryan
కార్తిక్ ఆర్యన్
author img

By

Published : Nov 11, 2022, 11:35 AM IST

'ప్యార్‌ కా పంచనామా'తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మొదటి సినిమాతో మహిళల్లో ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్న బాలీవుడ్‌ యువ కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌. కెరీర్‌ ఆరంభంలోనే స్టార్‌ స్టేటస్‌ సొంతం చేసుకున్న కార్తిక్‌ ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవలే 'భూల్ భులయ్యా 2' మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన.. అతడు ప్రస్తుతం 'సత్యప్రేమ్ కీ కథ' షూటింగ్​తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో కియారా అడ్వాణీ, కార్తిక్ సరసన నటిస్తోంది. అయితే ఆర్యన్.. త్వరలోనే తాను నటించిన 'ఫ్రెడ్డీ' చిత్రంతో డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హాట్​స్టార్​లో ఇది స్ట్రీమింగ్​ కానుంది. దీంతో ప్రమోషన్స్​లో పాల్గొన్న అతడు ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ఎప్పుడు స్లిమ్​గా క్లాస్​గా కనిపించే ఈ హీరో.. ఈ సినిమాలోని తన పాత్ర కోసం ఏకంగా 14కిలోల బరువు పెరిగాడట. చాలా కష్టపడ్డాడట.

"ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. దీనికోసం నిద్రలేని రాత్రులెన్నో గడిపాను. నటీనటులు తమలోని భిన్నమైన, పూర్తి నటుడిని బయటకు తీసుకొచ్చేందుకు ఇటువంటి అవకాశాలు అరుదుగా దొరుకుతాయి. ఫ్రెడ్డీ చిత్రంలో నా పాత్ర కూడా అలాంటిదే" అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఫ్రెడ్డీ చిత్రానికి శశాంక ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలాజీ టెలిఫిలిమ్స్, నార్తర్న్ లైట్స్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్​ మూవీలో అలయ ఎఫ్ కూడా మరో కీలక పాత్రలో నటించింది.

ఇవీ చదవండి:మలైక యస్ చెప్పింది అర్జున్​కు కాదా అసలు విషయం ఏంటంటే

మెగా డాటర్​ నిహారిక టాటూ చూశారా? దాని అర్థం ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.