ETV Bharat / entertainment

'భలే భలే బంజారా' ప్రోమో అదుర్స్- 'అర్జున కల్యాణం' కొత్త డేట్​ ఫిక్స్​ - ఎండీ సజ్జనార్

Movie Updates: మిమ్మల్ని పలకరించేందుకు సినీ అప్డేట్లు మరోసారి వచ్చాయి. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి 'ఆచార్య', విశ్వక్​సేన్​ 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమాల సంగతులు ఉన్నాయి

movie updates
movie updates
author img

By

Published : Apr 17, 2022, 6:22 PM IST

Acharya Bhale Bhale Bhanjara Promo: మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న 'ఆచార్య' చిత్రం నుంచి 'భలే భలే బంజారా' అనే గీతం ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్​ సంభాషణతో కూడిన టీజర్ వీడియో రిలీజ్ చేసిన చిత్రబృందం.. తాజాగా ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియో పంచుకుంది.

'సిరుత పులుల సిందాట' అంటూ సాగే 'భలే భలే బంజారా' గీతం ప్రోమో వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ సోషల్ మీడియాలో షేర్​ చేసింది. పూర్తి పాటను సోమవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించింది. 'భలే భలే బంజారా' గీతానికి మణిశర్మ బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ప్రోమోలో చిరంజీవి, రామ్​చరణ్​ స్టెప్పులతో అదరగొట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Ashoka Vanaamlo Arjuna Kalyanam: విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'అశోకవనంలో అర్జున కల్యాణం'. ఏప్రిల్‌ 22న విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. మరో ముహూర్తంగా మే 6ను చిత్ర బృందం తాజాగా ఖరారు చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో విశ్వక్‌ పొలం గట్టుపై నడుస్తూ కనిపించాడు. విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయిక. బాపినీడు, సుధీర్‌ ఈదర నిర్మించిన ఈ సినిమాను బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ సమర్పిస్తున్నారు. పెళ్లి కోసం కలలు కనే మూడు పదుల వయసు దాటిన అర్జున్‌ కుమార్‌గా విశ్వక్‌సేన్‌ సందడి చేయబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. మరి అర్జున్‌ పెళ్లి ఎలా జరిగింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

'అశోకవనంలో అర్జున కల్యాణం'.
'అశోకవనంలో అర్జున కల్యాణం'

RTC Junior NTR Video: తెలంగాణ ఆర్టీసీని తిరిగి లాభాల బాట ఎక్కించేందుకు ఎండీ సజ్జనార్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని అందరినీ ఆకట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రకరకాల పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేసి నెటిజన్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

'ఓ ఓసన్నా.. రోడ్డు జాగిలంగా ఉందని వంద రెండొందలు కొట్టమాకు.. 50,60 లో పో' అంటూ ఎన్టీఆర్​ చెప్పే డైలాగ్‌ను సజ్జనార్ పోస్టు చేశారు. ఇక ఆ పోస్టుపై ఎన్టీఆర్ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.

ఇవీ చదవండి: 'ఆ పని కూడా అయిపోయింది'.. సూపర్ అప్డేట్​ షేర్​ చేసిన సామ్

రణ్​బీర్​ రెమ్యూనరేషన్​ రూ.70 కోట్లు! మరి ఆలియా లెక్క ఎంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.