ETV Bharat / entertainment

సంక్రాంతి హీరోల రెమ్యునరేషన్​- మహేశ్, వెంకీ, నాగ్​, తేజ ఎన్ని రూ.కోట్లు తీసుకున్నారంటే?

2024 Sankranthi Movies : ఈ సంక్రాంతికి మహేశ్‌బాబు 'గుంటూరు కారం'(జనవరి 12), తేజ సజ్జ 'హను-మాన్‌'(జనవరి 12), వెంకటేశ్‌ సైంధవ్‌(జనవరి 13), నాగార్జున 'నా సామిరంగ' (జనవరి 14) పోటీ పడతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాల కోసం హీరోలు ఎంత రెమ్యునరేషన్​ తీసుకున్నారంటే?

2024 Sankranthi Movies
2024 Sankranthi Movies
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 11:11 AM IST

2024 Sankranthi Movies : పండగలు వస్తున్నాయంటే బాక్సాఫీస్ వద్ద సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుంటాయి. అలా ఈ ఏడాది సంక్రాంతికి ఐదు తెలుగు చిత్రాలు (2024 sankranthi movies) సందడి చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ జాబితా నుంచి తాజాగా ఈగల్‌ వాయిదా పడింది. రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే కలెక్షన్స్​పై ప్రభావం పడుతుందనే ఆలోచనతో వెనక్కి తగ్గింది! దీంతో, మహేశ్‌బాబు 'గుంటూరు కారం'(జనవరి 12), తేజ సజ్జ 'హను-మాన్‌'(జనవరి 12), వెంకటేశ్‌ సైంధవ్‌(జనవరి 13), నాగార్జున 'నా సామిరంగ' (జనవరి 14) 2024 సంక్రాంతి బరిలో పోటీ పడనున్నాయి.

ఈ సినిమాలపై అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. సినిమాకు సంబంధించి ఏ చిన్న అప్డేట్​ వచ్చినా, నెట్టింట్లో సమాచారం దొరికినా దాన్ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. అలాగే ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అన్న ఆసక్తితోనూ ఉన్నారు. అయితే సాధారణంగానే ఓ సినిమా రిలీజ్​ అవుతుందంటే ఆ సినిమా బడ్జెట్​ ఎంత, అందులో నటించిన హీరోహీరోయిన్ల పారితోషికం ఎంత అనే విషయాలను తెలుసుకునే ఉత్సుకత ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ముగ్గుల పండక్కి రాబోయే సినిమాల హీరోల రెమ్యునరేషన్​కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. వాటికి సంబంధించిన కథనాలు బయట చక్కర్లు కొడుతున్నాయి.

Gunturu karam Mahesh Babu Remuneration : ఈ సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాల్లో పెద్దది, ఆడియెన్స్​లో బాగా హైప్​ ఉన్న సినిమా SSMB 28 గుంటూరు కారం. అతడు, ఖలేజా వంటి సినిమాల తర్వాత మహేశ్​ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలో గ్రాండ్​గా విడుదల చేయబోతున్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రిపీట్ కాంబోతున్న ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా కోసం పెద్ద ఎత్తున అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్​ దాదాపు రూ.70కోట్లు తీసుకున్నాడని కథనాలు కనిపిస్తున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Hanuman Teja Sajja Remuneration : గుంటూరు కారం తర్వాత హైప్ ఉన్న సినిమా హనుమాన్​. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం కోసం తేజ సజ్జా రూ.కోటికి పైగా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

Saindhav Venkatesh Remuneration : విక్టరీ వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న సినిమా సైంధవ్. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయినపల్లి నిర్మించారు. రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం కోసం వెంకీ రూ.17కోట్ల వరకు తీసుకున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

Naa Saami Ranga Nagarjuna Remuneration : నాగార్జున హీరోగా ఆశికా రంగనాథ్ హీరోయిన్​గా విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా నా సామి రంగ. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్​లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రం కోసం నాగ్​ రూ.10కోట్లు ఛార్జ్​ చేశారట. అలాగే థియేట్రికల్ రైట్స్​ కూడా కొనుగోలు చేశారని, సినిమాను నిర్మాత దిల్ రాజు ద్వారా విడుదల చేయిస్తున్నారట.

మరోవైపు ఈ సినిమాలతో పాటు ధనుశ్ నటించిన కెప్టెన్‌ మిల్లర్‌, శివ కార్తికేయన్‌ అయలాన్‌, విజయ్‌ సేతుపతి మెరీ క్రిస్మస్‌ జనవరి 12న విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ సినిమాల కోసం హీరోలు ఎంత పారితోషికం తీసుకున్నారో స్పష్టత లేదు.

'గుంటూరు కారం' ప్రీ రిలీజ్​ ఈవెంట్ వాయిదా- కారణం అదేనా?

'త్రివిక్రమ్​ సెకండ్​ హీరోయిన్ సెంటిమెంట్​'- గుంటూరు కారంతో మీనాక్షి ఏం చేస్తుందో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.