ETV Bharat / entertainment

తారక్ నటనకు హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా.. మార్వెల్ మూవీలో ఛాన్స్? - ఎన్టీఆర్​పై హాలీవుడ్​ జేమ్స్​ గన్​ ప్రశంసలు

హాలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ జేమ్స్ గన్ ఓ ఇంటర్వ్యూలో జూనియర్​ ఎన్టీఆర్​ను కొనియాడారు. ఆర్​ఆర్​ఆర్​లో తారక్ నటనకు మెచ్చిన జేమ్స్​.. ఎన్టీఆర్​ కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉందని అన్నారు.

"Who is the RRR guy? He is so good. The person emerging from the cage along with the tigers Jr NTR! Someday, I hope to collaborate with him," James said adding, 'he is so cool and amazing.'
RRR
author img

By

Published : Apr 26, 2023, 12:17 PM IST

Updated : Apr 26, 2023, 2:35 PM IST

తెలుగులో రూపుదిద్దుకొని భారతీయ చిత్రంగా విడుదలైన ఆర్ఆర్ఆర్​కు అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎంతో మంది సెలబ్రిటీలు ఈ సినిమాను ఆకాశానికెత్తేశారు. ప్రతి డైరెక్టర్.. ఈ సినిమా గురించి, అందులోని క్యారెక్టర్ల గురించి చెబుతూ.. సూపర్ అని మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' లాంటి అద్భుతమైన మార్వెల్ చిత్రాలను తెరకెక్కించిన హాలీవుడ్​ స్టార్​ డైరెక్టర్​ జేమ్స్ గన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో జూనియర్​ ఎన్టీఆర్​ను కొనియాడారు. అంతేకాకుండా ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉందని మనసులో మాటను బయటపెట్టారు.

"ఆర్ఆర్ఆర్​లో నటించిన ఆ వ్యక్తి ఎవరు. బోనులో పులులతో పాటు బయటకు వస్తాడు. జూనియర్​ ఎన్టీఆర్​. అతను చాలా బాగా చేశాడు. ఏదో ఒక రోజు అతడితో కలసి పనిచేయాలని కోరుకుంటున్నాను. అతను చాలా అద్భుతమైన వ్యక్తి" అంటూ ఎన్టీఆర్​ను ఆకాశానికి ఎత్తేశారు జేమ్స్ గన్. తారక్​కు ఎలాంటి రోల్ ఇస్తారని అదే ఇంటర్వ్యూలో అడగగా.. ప్రస్తుతానికి దానిపై క్లారిటీ లేదని జేమ్స్ చెప్పుకొచ్చారు. తారక్ రోల్​ను డిసైడ్ చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో తారక్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. మార్వెల్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్​ను తప్పకుండా చూస్తామని అంటున్నారు.

గత జులైలోనే 'ఆర్ఆర్ఆర్' సినిమా చూసిన జేమ్స్ గన్.. ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్విట్టర్​ వేదికగా తన అభిప్రయాన్ని తెలియజేశారు. ఎన్టీఆర్​-రామ్ చరణ్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయినట్లు ఆ ట్వీట్​లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన 'గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ' సినిమా రిలీజ్​కు రెడీగా ఉంది. ఈ సినిమా మే5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తారక్​పై ప్రశంసలు కురిపించారు.

ఇక ఎన్టీఆర్​ సినిమాల విషయానికి వస్తే.. ఆర్​ఆర్​ఆర్​ తర్వాత ఆయన​ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్​ 30' లో నటిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమంతో మొదలైన ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, ఛాయగ్రహకుడిగా రత్నవేలు , శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

Last Updated : Apr 26, 2023, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.