ETV Bharat / elections

ముగింపు ఉత్సాహం.. సకుటుంబ సపరివార ప్రచారం - serial actors

ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ..పార్టీలు ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. నేతలే కాకుండా వారి కుటుంబ సభ్యులు రంగంలోకి దిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. 'కాదెవరూ ప్రచారానికి అనర్హం' అన్నట్లు సినీనటులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు పాల్గొని..తమ అభ్యర్థుల్ని గెలిపించాలని వేడుకుంటున్నారు.

కాదెవరు ప్రచారానికి అనర్హం
author img

By

Published : Apr 8, 2019, 6:54 AM IST

Updated : Apr 8, 2019, 7:27 AM IST

రేపటితో ప్రచార పర్వానికి తెరపడనున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రచార వేగం పెంచాయి. ఓట్లు రాబట్టడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. తమ కుటుంబీకులకు మద్దతుగా సినీ నటులు పాల్గొని ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
జనసేనకు మద్దతుగా నాగబాబు కుమారుడు హీరో వరుణ్​తేజ్...​ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రోడ్​ షో నిర్వహించారు. తన తండ్రిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతపురం జిల్లాలో సినీనటుడు నారా రోహిత్​ తెదేపా తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పుట్టపర్తి అభ్యర్థి పల్లె రఘనాథరెడ్డి, రాయదుర్గం అభ్యర్థి కాల్వ శ్రీనివాసులకు ఓటు వేయాలని కోరారు.
విజయనగరం జిల్లాలో నందమూరి బాలకృష్ణ రోడ్​ షోకు హాజరయ్యారు. పార్లమెంట్​ అభ్యర్థి అశోక్​ గజపతిరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి అదితిలకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నారా రామ్మూర్తి తనయుడు..గిరీష్​ తెదేపాకు మద్దతుగా ప్రచారం చేశారు. కృష్ణా జిల్లా కైకలూరులో బుల్లితెర నటులు భగవాన్​, శ్రావణి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో జనసేన కార్యకర్తల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పార్టీ సిద్ధాంతాలు..అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలపై రూపొందించిన పాటలకు డ్యాన్సులతో ప్రచారం చేశారు. తెదేపాకు సంఘీభావంగా గుంటూరులో మహిళలు ర్యాలీ నిర్వహించారు.

వినూత్న ప్రచారాలతో దూసుకుపోతున్న పార్టీలు

ఇవీ చదవండి..

తెదేపా విజయాన్ని కాంక్షిస్తూ.. నటుల ప్రచారం

ap_vsp_05_07_jagan_sabga_akp_avb_R54 రిపోర్టర్ : ఆదిత్య పవన్ కెమెరా: ఏ శ్రీనివాసరావు ()అనకాపల్లి  పార్లిమెంట్ నియోజక వర్గం లో ప్రతిపక్ష నేత జగన్ రోడ్ షో నిర్వహించారు..తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ...ఎన్నికల కోసం హడావిడి గా తెరిచి ఏడాది నుంచి జీతాలు కూడా ఇవ్వటం లేదని ఆరోపించారు. నీళ్లు 20 రూపాయలు ఉంటే లీటర్ పాలు 23 రూపాయలకు అమ్మాల్సి  వస్తోందనే బాధను పాదయాత్ర లో తెలుసుకునట్టు జగన్ చెప్పారు. విశాఖ డైరీ పెద్దలు కొడుకుతో హైద్రాబాద్ లో ప్రైవేట్ డైరీ తెరిచారని ఆరోపించారు. హెరిటేజ్, విశాఖ డైరీ రైతుల కష్టాన్ని దోస్తున్నాయని జగన్ ఆవేదన వ్యక్ట్జం చేశారు.అనకాపల్లి హాస్పిటల్ అప్ గ్రేడ్ చేశారు,కానీ సౌకర్యాలు లేవని ఆరోపించారు.సత్యనారాయణపురం లో ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ 3లక్షలు రుణంగా ,నెలకు 3వేలు రి-పేమెంట్ రద్దు చేస్తాను  అని హామీ ఇచ్చారు జగన్ . జివి కృష్ణారావును వైకాపా కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు ... బైట్ : ప్రతి పక్ష నేత జగన్
Last Updated : Apr 8, 2019, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.