ETV Bharat / elections

లక్ష కోట్లు ఎగ్గొట్టేందుకు కేసీఆర్ యత్నం: చంద్రబాబు

author img

By

Published : Apr 6, 2019, 8:48 PM IST

విభజన హామీలు అడిగితే ఐటీ, ఈడీ దాడులు చేయిస్తారా అని సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా చీరాల రోడ్ షోలో ధ్వజమెత్తారు. మోదీని గుజరాత్‌కు పంపించేవరకు వెంటాడతానన్న సీఎం...ఆంధ్రాపై తెలంగాణ వాళ్ల పెత్తనం ఏంటని మండిపడ్డారు.

చీరాల రోడ్ షోలో చంద్రబాబు
చీరాల రోడ్ షోలో చంద్రబాబు

కేసుల్లో జగన్‌తో చీరాల వైకాపా అభ్యర్థి పోటీపడుతున్నారని విమర్శించిన సీఎం... జగన్‌పై 31 కేసులుంటే ఆమంచిపై 29 కేసులున్నాయన్నారు. కబ్జారాయుళ్ల నుంచి వాన్‌పిక్ సిటీ భూములు తీసుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు...చీరాల చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వాడరేవు వద్ద రూ.4,900 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌ నిర్మిస్తామని ప్రకటించారు.

వస్త్ర పరిశ్రమ కేంద్రంగా చీరాలను తయారుచేస్తానని హామీ ఇచ్చారు. అమ్మకు వందనం పేరుతో ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని సీఎం ప్రకటించారు. పెద్దకుమారుడిగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్నానని పేర్కొన్న బాబు...అందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. జగన్​కు వెయ్యి కోట్లు ఇచ్చి... లక్ష కోట్లు ఎగ్గొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ఆర్థిక ఉగ్రవాదులను గెలిపిస్తే రాష్ట్రం నాశనం అవుతుందని హెచ్చరించారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ను బంగాళాఖాతంలోకి విసిరేద్దాం అని చీరాల ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఇవీ చూడండి : సమరాంధ్ర... ధనం మూలం ఇదం రాజకీయం!

Intro:రాజకీయ మార్పు కోసం జనసేన పార్టీని ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి దాసరి రాజు అన్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి గ్రామంలో శనివారం ప్రచారాలు కొనసాగించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు అందించి ఓటు వేయమని కోరారు

Body:ఈటీవీ

Conclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.