Unemployment Rate Decreased On Youth Of 15 To 29 Age in Telangana : తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న 15-29 ఏళ్ల మధ్య యువతలో నిరుద్యోగం రేటు కొంతమేరకు తగ్గింది. గత సంత్సరం 2023( జులై-సెప్టెంబరు)తో పోలిస్తే నిరుద్యోగ రేటు 22.9 నుంచి 18.1 శాతానికి తగ్గింది. ఈ విషయాన్ని జాతీయ కార్మిక బలగం త్రైమాసిక నివేదికలో (జులై-సెప్టెంబరు 2024) వెల్లడైంది. గత ఆరునెలలుగా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరగడం, ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు వస్తుండటంతో యువతకు ఉపాధి దొరుకుతుంది.
రెండోస్థానంలో ఏపీ : అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుంటే నిరుద్యోగ రేటు 6.6 శాతంగా ఉన్నట్టు నివేదిక తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే సగటు నిరుద్యోగరేటులో కేరళ 10.1 శాతంతో మొదటి స్థానంలో ఉంది. అలాగే ఏపీ 7.3 శాతంతో రెండోస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా అత్యల్ప నిరుద్యోగరేటు 2.6 శాతంతో దిల్లీ తొలిస్థానంలో ఉంది. కర్ణాటక 4శాతంతో ఆ తర్వాతి స్థానంలో ఉంది. మొత్తంగా 22 రాష్ట్రాల నిరుద్యోగ రేటును పరిగణలోని తీసుకుంటే తెలంగాణ పదోస్థానంలో ఉంది. జాతీయ నిరుద్యోగ రేటు 6.4శాతంగా ఉంది.
వారందరికీ 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి - ప్రభుత్వం ఉత్తర్వులు
మహిళల్లో పెరిగిన నిరుద్యోగ రేటు : తెలంగాణ రాష్ట్రంలో యువతలో నిరుద్యోగ రేటు తగ్గుతున్నప్పటికీ మహిళల్లో మాత్రం నిరుద్యోగ రేటు పెరగడం గమనార్హం. గత సంవత్సరం (2023 జులై-సెప్టెంబరు) మహిళల్లో నిరుద్యోగ రేటు 24.3 శాతం ఉండేది. ప్రస్తుతం అది 31.3 శాతానికి పెరిగింది. పెద్ద చదువులు చదువుకున్నా కూడా మహిళలను సామాజిక కట్టుబాట్లతో తల్లిదండ్రులు/ భర్తలు ఉద్యోగాలకు పంపించటం లేదు. అదేవిధంగా అవకాశాలు వచ్చినా కూడా వివాహాల అనంతరం మహిళలు ఇంటిపనులు, కుటుంబ బాధ్యతలతో ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టాటం లేదు. అయితే పురుషుల్లో మాత్రం నిరుద్యోగం రేటు తగ్గింది.
ఏఐ టెక్నాలజీతో సీవీ- కంగుతిన్న సీఈవో- వైరల్‌గా మారిన స్క్రీన్‌షాట్