ETV Bharat / crime

ధర్మవరంలో ఉద్రిక్తత.. భాజపా నేతలపై వైకాపా కార్యకర్తల దాడి - ఆంధ్రప్రదేశ్ నేర వార్తలు

ATTACK
ATTACK
author img

By

Published : Jun 28, 2022, 11:09 AM IST

Updated : Jun 28, 2022, 12:46 PM IST

11:08 June 28

కర్రలతో దాడి.. ముగ్గురికి గాయాలు

ధర్మవరంలో భాజపా నేతలపై వైకాపా కార్యకర్తల దాడి

ATTACK: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియా సమావేశం ఏర్పాటు చేసిన భాజపా నేతలపై.. వైకాపా వర్గీయులు కర్రలతో దాడి చేశారు. భాజపా నేతలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే.. రక్తం కళ్లజూశారు. విచక్షణారహితంగా దాడి చేసి.. తిరిగి కారులో వెళ్లిపోయారు. ధర్మవరం పట్టణ భాజపా అధ్యక్షుడు రాజు, భాజపా కార్యదర్శి రాము సహా మరొకరికి గాయాలయ్యాయి. వారిని పోలీసులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు.

ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశానికి సన్నద్ధమవుతుండగా వైకాపా కార్యకర్తలు, స్థానిక నేతలు ఒక్కసారిగా దాడి చేసినట్లు భాజపా నాయకులు చెప్పారు. నిన్న నియోజకవర్గ ప్లీనరీ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణపై చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు దాడికి పాల్పడ్డవారిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణం దాటి వెళ్లకుండా చెక్‌పోస్టులను అలర్ట్‌ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 28, 2022, 12:46 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.